Joint Pain: కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందాలంటే దీన్ని 15 రోజులు తాగాలట!

Joint Pain: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వస్తోంద. ఆ కారణంగా శరీరానికి సరైన పోషకాహారం దొరకకపోవడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాక తీసుకోకపోవడం, టైంకి తినక పోవటం, సరైన సమయానికి నిద్ర పోకుండా ఉండటం, పని ఒత్తిడి వంటి కారణాలతో తక్కువ పని చేసిన త్వరగా అలసిపోవడం జరుగుతుంటుంది. అలాగే క్యాల్షియం లోపం కారణంగా ఎముకల బలం తగ్గడం, అలుసుగా మారటం, మోకాళ్లు, కీళ్ల నొప్పులు రావడం మొదలవుతుంది.

ఈ లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తించి ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే కీళ్ల నొప్పుదు వచ్చేవి. కానీ.. నేటి కాలంలో 25–30 ఏళ్ల వారికి కూడా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.ఈ పొడిని తయారు చేçసుకుని పదిహేను రోజుల పాటు తాగితే అన్నీ సమస్యలు తగ్గిపోతాయి. దీని కోసం ఒక పాన్‌లో 6 బాదం పప్పులు, 12 పూల్‌ మఖానా, పావుస్పూన్‌ మెంతులు, ఒక స్పూన్‌ గసగసాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి వేగించాలి. బాగా వేగాక మిక్సీ జార్‌లో వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్‌ పసుపు, పావుస్పూన్‌ శొంఠి పొడి వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిని డబ్బాలో పోసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్‌ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్‌ పొడి కలుపుకొని ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో తాగితే అన్నీ సమస్యలు తగ్గటమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ పొడిలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్‌ లో ఉన్న పోషకాలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్‌ ఫెక్షన్స్‌ రాకుండా లో కాపాడుతుంది. ఈ పాలను రాత్రి సమయంలో తాగితే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తోందని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -