Warm milk: పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగుతున్నారా?

Warm milk: పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజ చేకూరతాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమందికి ఉదయం పూట పాలు తాగే అలవాటు ఉంటే,మరికొందరికి రాత్రి సమయంలో పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. కొందరు రాత్రి సమయంలో పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుందని తాగుతూ ఉంటారు. పాలు ఉదయం సమయంలో కంటే రాత్రి సమయంలో తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులుఅయితే ఈ మధ్యకాలంలో చాలా మంది వర్క్ ఫ్రంహోం అని చెప్పి ఇంట్లోనే పని చేస్తున్నారు.

కదలకుండా ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం వలన అతనికి పెద్దగా అలసట తెలియదు. మెదడుపై ప్రెషర్ పై పడుతుంది కానీ శరీరం పై ఫిజికల్‌గా ఎటువంటి ప్రభావం పడదు. దానికి తోడు చాలామంది తిన్న తరువాత వాకింగ్ చేయడం కూడా కొందరు మరిచారు. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వెంటాడుతాయి. అటువంటి వారు తప్పకుండా ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రి గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది.

 

ఇది సెరోటోనిన్ అనే కణాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. కొందరు రాత్రుళ్లు పడుకునే ముందు టీవీ లేదా మొబైల్ చూడటానికి అలవాటు పడుతుంటారు. దానికి తోడు ఇష్టమైన చిరుతిళ్లు తింటారు. అటువంటి చిరుతిండ్లు ఆరోగ్యానికి హానికరం. అందుకే రాత్రిపూట పాలు తాగడం వలన ఇది మన పొట్టను చాలా సేపు నిండుగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. కొందరికి పాలు వాసన నచ్చదు. అప్పుడు పాలు మరిగించే సమయంలో యాలకుల పొడిని కలుపుకొని తాగవచ్చు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -