Natural Hair Dyes: తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారా.. ఇది అప్లై చేయండి!

Natural Hair Dyes: పూర్వం తెల్ల జుట్టు రావాలంటే ఐదు పదుల వయస్సు దాటితేనే వచ్చేది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది. తీసుకుంటున్న ఆహార లోపమో.. మనుషుల బలహీనతో తెలిదు కానీ.. వయస్సు భేదం లేకుండా తెల్ల జుట్టు వస్తుంది. వృద్ధాప్య ప్రభావం చర్మంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమైన ప్రక్రియ. జుట్టు నెరసిపోవడంపై అనేక పరిశోధనలు జరిగాయి. అందులో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు వర్ణద్రవ్యం తయారు చేయడం ఆపి వేసినప్పుడు, జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది.

కొన్నిసార్లు సహజ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కూడా జుట్టులోకి దూసుకు రావడం కూడా తెల్లజుట్టుకు కారణమవుతోంది. వయసు పెరిగే కొలది జుట్టు నెరసిపోయినా పర్వాలేదు కానీ ఈరోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడానికి కారణం శరీరంలో విటమిన్‌ బీ–12 లేకపోవడం కూడా. ఈ విటమిన్‌ శరీరానికి శక్తిని ఇస్తుంది. జుట్టు పెరుగుదల, రంగును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

కొంతమంది తెల్లజుట్టును దాచుకోవడానికి హెయిర్‌ డైని ఉపయోగిస్తే, జుట్టు మీద కెమికల్‌ బేస్డ్‌ హెయిర్‌ కలర్‌ వేయడానికి భయపడేవారు కొందరు. మీరు కెమికల్‌ బేస్డ్‌ హెయిర్‌ కలర్‌ను కూడా నివారించినట్లయితే తెల్ల జుట్టుతో కూడా ఇబ్బంది పడుతుంటే కాఫీ యొక్క సహజ మాస్క్‌ను వేసుకోవచ్చు. జుట్టుకు కాఫీని ఉపయోగించడం వల్ల జుట్టుకు అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది జుట్టును బలహీనంగా మార్చే ఎంజైమ్‌లను నివారిస్తుంది.

కాఫీలో ఉండే కెఫిన్‌ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. జుట్టును బలంగా చేస్తుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాఫీ హెయిర్‌ మాస్క్‌ మీ జుట్టును ఒక వారం పాటు నల్లగా ఉంచుతుంది. ఈ జుట్టు రంగు ఎంతకాలం ఉంటుంది అనేది మీ హెయిర్‌ వాష్‌ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒక వారంలో షాంపూని ఎక్కువగా ఉపయోగిస్తే, ఈ హెయిర్‌ మాస్క్‌ జుట్టు నుండి త్వరగా బయటకు రావచ్చు.

తయారు చేసే విధానం..

ముందుగా ఒక పాత్రలో నీటిని పోసి తక్కువ మంట మీద ఉంచండి. ఈ నీటిలో రెండు టీ స్ఫూన్ల కాఫీ పౌడర్‌ వేసి కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని చల్లార్చాలి. ఆ నీటిలో మీ జుట్టు పొడవు, పెరుగుదలకు అనుగుణంగా రెండు స్పూన్ల కండీషనర్‌ వేసి బాగా కలి తెల్ల వెంట్రుకలకు బాగా అంటించి అరగంట పాటు ఎండకు ఆరనివ్వాలి. స్నానం చేసేటప్పుడు ముందుకు ఆ వెండ్రుకలకు షాంపుతో అప్లై చేసి స్నానం చేయాలి

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -