AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగేది అప్పుడే.. వాళ్లకు షాకంటూ?

AP Elections: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచనలు ఉన్నారా అంటే ఉన్నారనే సమాచారం వినపడుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది పాటు సమయం ఉండగా ఈయన మాత్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఈ విషయం గురించి జగన్ ఇదివరకే ప్రధాని మోడీని కలిసి ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇలా జగన్ రాజకీయ వ్యూహాలు ఎవరికి అంత తొందరగా అర్థం కావు.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ఊహించని విధంగా మెజారిటీ వచ్చింది తద్వారా తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు కుదుర్చుకొని మరిన్ని అస్త్రాలు ఉపయోగించకుండా వాటిని అడ్డుకోవడం కోసం జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. గత వారం ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్ పోలవరం నిధుల గురించి ప్రధానితో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.

 

తాజాగా మరోసారి ఈయన ఢిల్లీ వెళ్లడంతో అందరి ఆలోచనలు జగన్ ఢిల్లీ పర్యటన పైనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం జగన్ ముందస్తు ఎన్నికల గురించి ప్రధానితో చర్చించడం కోసమే ఢిల్లీ వెళ్లారని తెలుస్తుంది.ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎన్నికలలో వారికి చావు దెబ్బ కొట్టడం కోసమే జగన్ సరికొత్త వ్యూహాన్ని రచించారని అందుకే ముందస్తు ఎన్నికలను నిర్వహించేలా పక్కా ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారని తెలుస్తుంది.

 

ఎన్నికలకు ఇంకా ఏడాది పాటు సమయం ఉంది అయితే ఇంత సమయం తెలుగుదేశం పార్టీకి ఇస్తే కనుక వారు మరిన్ని ఎత్తులు వేసే అవకాశం ఉండడంతో అలాంటి ఛాన్స్ వారికి ఇవ్వకుండా ఈ ఏడాది నవంబర్ నెలలోనే ఎన్నికలు జరగాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తన ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బయటపడింది. ఆ రెండు పార్టీలు కలవకుండా ఎన్నికల బరిలో దిగితే మరోసారి అధికారం అందుకునే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -