Winter Skin Care Tips: నెయ్యి వాడితే అది అందంగా మారుతుందట!

Winter Skin Care Tips: చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. అలాంటçప్పుటు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. చలికాలంలో చర్మం డ్రై అవుతుంటుంది. ముఖం నల్లగా మారిపోతుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసేందుకు మార్కెట్లో లభించే వివిధ లోషన్లు వినియోగిస్తుంటాం. ఈ లోషన్లు కూడా కాసేపటి వరకే పనిచేస్తాయి. అంతకు మించి వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. ఇలాంటప్పుడు చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసేందుకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది.

నెయ్యి ఆరోగ్యంతో పాటు చర్మానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ముఖానికి నెయ్యి రాసుకుంటే ముఖంపై ఉండే మచ్చలు, నల్లటి మరకలు, డార్క్‌ సర్కిల్స్, తొలగిపోతాయి. అటు చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. నెయ్యిలో ఉండే పోషకాలతో స్కిన్‌ ఇన్ఫెక్షన్, స్పెల్లింగ్‌ దూరమవుతాయి. నెయ్యితో బాడీ మసాజ్‌ చేస్తే దురద సమస్య కూడా తొలగిపోతోంది. నెయ్యి ముఖానికి, కళ్ల కింద రాసుకోవడంతో కంటి అలసట పోతుంది. రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు సర్కులర్‌ మోషన్లో కంటి చుట్టూ నెయ్యితో తేలిగ్గా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ సర్కిల్స్‌ తొలగిపోతాయి.

నెయ్యి రాయడం వల్ల చర్మానికి నిగారింపు, మృదుత్వం వస్తాయి. దీనికోసం రోజు రాత్రి çపడుకునేముందు ముఖంపై నెయ్యి రాసి నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య లక్షణాలు ఉంటే అవి కూడా క్రమంగా తగ్గిపోతాయి. పగిలిన పెదాలకు కూడా నెయ్యి బాగా పనిచేస్తుంది. పెదాలపై నెయ్యి రాస్తే పెదాలు పగిలే సమస్య దూరమవుతుంది. పెదాలు డ్రై కాకుండా మృదువుగా ఉండేట్లు చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -