Bone Density: ఇవి తింటే మీ ఎముకలు వెరీ స్ట్రాంగ్.. ఏం తినాలంటే?

Bone Density: సాధారణంగా మనకు వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో పటిష్టత కోల్పోవడం సహజం. అలాంటి సందర్భాల్లో నవ యవ్వనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కూడా ఎముకలు స్ట్రాంగ్ లేదా బలహీన పడటం జరుగుతుంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ మెయిన్ టైన్ చేస్తే ఎముకలు గట్టిగా ఉంచుకోవచ్చు.

ఎముకల సాంద్రత, బలాన్ని పెంచడంలో క్యాల్షియం ఎంతగానో దోహద పడుతుంది. మనం చిన్నతనం నుంచి ఎముకలను బలోపేతం చేయడానికి రకరకాల తిండి తింటుంటాం. వాటిలో క్యాల్షియం ఉండేలా చూసుకుంటుంటాం. కొందరు తల్లదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచి ఎముకల పటిష్టత గురించి చెప్పి జాగ్రత్త పడాలని సూచిస్తుంటారు. పోషకాహారం అందిస్తుంటారు.

గుండె జబ్బులులు, మధుమేహం, క్యాన్సర్ తదితర వాటిని నివారించాలంటే విటమిన్ కె తీసుకోవడం శరీరానికి అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యం కాపాడుకొనేందుకు విటమిన్ కె ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అంటే.. బ్రోకలి, బచ్చలికూర, క్యాబేజీ లాంటివి తింటూ ఉండాలి. అప్పుడు మన దేహానికి సరైన పోషకాలు అందుతాయి.

అలాగే విటమిన్ డి ఉన్న పదార్థాలు కూడా ఎముకల పటిష్టత కోసం తీసుకోవాలి. దీన్ని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తాం. సూర్యరశ్మి మన చర్మాన్ని తాకితే అది కణాల్లో నిల్వ అయ్యి కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వయోభారం వచ్చినప్పుడు ప్రోటీన్లు తీసుకోవడం తప్పనిసరి. రోజుకు ఒక వ్యక్తికి 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. కాయ ధాన్యాలు, బీన్స్, చికెన్, మటన్, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకుంటే ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్ సి కూడా తీసుకోవాలి. ఇది కొన్ని రకాల పండ్లలో అధికంగా ఉంటుంది. నారింజ, టమోటా, ఇతర సిట్రస్ పండ్లు తినాలి. తద్వారా శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -