Blood Platelets: రక్తంలో ప్లేట్ లెట్స్ పెరగాలంటే తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

Blood Platelets: నేటి కాలంలో తీసుకుంటున్న ఆహారలోపమో.. లేక రోగ నిరోధక శక్తి లేకపోవడమో తెలిదు కానీ.. వివిధ రకాల రోగాలు వెంటాడుతున్నాయి. దోమలు ఎక్కువగా కుట్టినప్పుడు రోజుల వ్యవధిలోనే డెంగీ బారిన పడుతున్నారు. డెంగీ వచ్చినప్పుడు అమాంతంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోయి ఆరోగ్యం మరింత విషమించి పోతోంది. అంతేకాక ఒక్కొసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది.  అలాంటి జ్వరాలు వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు వైద్యంతో పాటు ఎలాంటి మందులు తీసుకోవాలో అని సలహాలు చేస్తుంటారు.

అలాంటప్పుడు కొన్నిరకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయని సలహాలు చేస్తుంటారు. డెంగీ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్‌ పడిపోయినుప్పడు ఎంత ఎక్కువ పండ్లు తీసుకుంటామో అంత తొందరగా వాటిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఎండు ద్రాక్షల్లో దాదాపుగా 30 శాతం ఐరన్‌ ఉంటుంది.  కాబట్టి అలాంటి పండ్లు తింటే త్వరగా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెరుగుతోంది. ఆప్రికాట్‌ పండ్లను రోజూ రెండు సార్లు తీసుకుంటే రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటే కూడా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. ఇలా ఎక్కువగా తీసుకుంటే డెంగీ నుంచి త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు సూచిస్తుంటారు. డెంగీ సోకిన వారు బొప్పాయి పండ్లను తినడంతో త్వరగా కోలుకుంటారు. అంతేకాదు బొప్పాయి ఆకు రసం తీసుకున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.
దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తింటే వాటిలో ఉండే విటమిన్‌–కే  ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది. వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. క్యారెట్‌ను తరచూ తింటే రక్తం వృద్ధిచెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. రక్తహీనతతో బాధపడేవారే కాదు, డెంగీ వచ్చిన వారు కూడా బీట్‌ రూట్‌ జ్యూస్‌ను తాగాలని సూయిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -