Guava: రోజు జామపండు తింటే చాలు.. ఆ సమస్యలు పరార్?

Guava: జామ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.అలాగే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకపదార్ధాలు సమృద్ధిగా లభిస్తాయి. తరచూ జామపండ్లను తినేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. జామ ఒక మెడిసిన్ వంటిది. ఈ మధ్యకాలంలో సరైన ఆహారం తీసుకోక చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు.

అందులో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంతా ఉన్నారు. కారణం వీరి బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే. జామ పండ్లు తరచూ తినే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి మెండుగా ఉంటుంది. అలాగే కడుపునొప్పితో బాధపడేవారు జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజూ ఒక జామ పండును తినాలి. జామ పండు కడుపులోని మలినాలను శుభ్రం చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జామను ఆహారంలో చేర్చుకోవాలి. జామలోని పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామతో మనిషి శరీరం కూడా కాంతివంతంగా తయారవుతుంది.

 

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా జామపండ్లు తింటే చాలా మేలు కలుగుతుంది. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. జామ కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. ఇందులో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. జామ కాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -