Diabetes: టైప్‌–2 డయాబెటీస్‌ ఉన్న వారు వీటినే ఆహారంగా తీసుకోవాలి!

Diabetes: మారుతున్న కాలమో.. తీసుకుంటున్న ఆహారమో.. తెలియదు గానీ.. వయస్సు భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ వివిధ రకాల వ్యాధులు దరి చేస్తున్నాయి. అంతేకాక కుటుంబంలో ఒక్కరైనా డయాబెటీస్‌తో బాధపడుతుంటారు. అయితే.. టైప్‌–2 డయాబెటిస్‌ వ్యాధి బతికున్నంతా కాలం ఉంటుదని చాలా మందిలో ఓ అపోహ ఉంది. అయితే అందుకు తగ్గ ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే దాని నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టైప్‌–2 డయాబెటీస్‌తో బాధపడేవారు శుద్ధిచేసిన పండి పదార్థాలు తినరాదు. పిస్తా, వైట్‌బ్రెడ్, పిజ్జా లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

 

టైప్‌–2 డయాబెటీస్‌ ఉన్న వాళ్లు మెంతికూర, లేదా మేథిదానా తీసుకుంటే జీర్ణక్రియకు చాలా దోహదపడుతాయి. ఇవి తినడంతో కార్పొహైడ్రేట్ల శోచణను మందగించడంతో అవి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తోంది. మెంతి పొడిని తయారుచేసుకుని భోజనంలో చేర్చుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకు ఎక్కువ ఫైబర్‌ ఉండే చాలా అవసరం. ఇలాంటి ఆహారం తీసుకోవడం తో శరీరంలో ఉండే చెడు పదార్థాలను తొలగిస్తుంది. పేగుల కదలికలను కూడా సులభతరం చేస్తుంది. బేబి కార్న్, టమాటా, క్యారెట్లు, బ్రోకలీ, బచ్చర కూర, దోసకాయ వంటి పదార్థాలు తీసుకోవాలి.

 

టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్‌ మరియు కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగుపరుస్తుందని సూచించింది. దాల్చిన చెక్కలను నీటిలో ఉడకబెట్టడం ద్వా లేదా మీ సాధారణ కప్పు టీ లో చేర్చడం ద్వారా మీరు వాటిని సులభంగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. నేరేడుపళ్లను తింటే ఇన్సులిన్‌ చర్య మరియు సున్నితత్వాన్ని పెంచుతుంది, ఇది అధిక రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా, దానిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -