TRS: టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం, మునుగోడు ఉపఎన్నికల తర్వాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల మీద ఈడీ, ఐటీ దాడులు మొదలయ్యాయి. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. కరీంనగర్ లో ఉన్న ఆయనకు సంబంధించిన మూడు గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించింది.

 

ఈ క్రమంలో తాజగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంలో ఈడీ తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని శ్రీ నగర్ లోని ఆమె నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈడీ,ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టిన టీఆర్ఎస్ నేతలు, అధికార పార్టీ నేతలతో సంబంధాలు కలిగిన వారి నివాసాల్లో సోదాలు నిర్వహించడం ప్రకంపనలు రేపింది. బుధవారం హైదరాబాద్, కరీంనగర్ లోని 40 ప్రాంతాల్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

గ్రానైట్ కంపెనీలతో పాటు గ్రానైట్ కంపెనీ యజమానుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ కి చెందిన శ్వేత ఏజెన్సీస్ తో పాటు మరో రెండు కంపెనీలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. పెఘా నిబంధనలను ఉల్లంఘించారని, ప్రభుత్వం అనుమతి లేకుండా కాకినాడ పోర్టు ద్వారా గ్రానైట్ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై గతంలో 9 గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. మంత్రి గంగుల కమలాకర్ కి చెందిన శ్వేత ఏజెన్సీకి కూడా గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో మరోసారి ఆయన కాంపెనీలలో తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -