Old Couple: వృద్ధ దంపతుల ప్రేమ.. వీడియో నెట్టింట్లో వైరల్‌!

Old Couple: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. ఒక్కసారి ఇద్దరు ఒకటైతే వారు బతికున్నంత కాలం కలిసి మెలిసి ఉండాలంటారు. ప్రస్తుతకాలంలో చిన్న చిన్న గొడలకే మనస్పర్థాలు తెచ్చుకొని పెళ్లైన కొన్ని రోజులకే విడిపోయి ఒంటరికి మిగిలిపోయి కుంగిపోతున్నారు. మనస్పర్థాలతో కొందరైతే.. ఆర్థిక సమస్యలతో మరికొందరు దూరమవుతున్నారు. తాజాగా ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణి షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ అందరినీ ఆలోజింపచేస్తోంది. డా. సుమిత్రా మిశ్రా హరియాణా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు చీఫ్‌ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. హరియాణా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఐఏఎస్‌ అధికారి డా. సుమిత్ర మిశ్రా ఓ వృద్ధ దంపతుల వీడియోను షేర్‌ చేశారు. ఇందులో తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న భర్తకు భార్య ఆహారం, పానీయాన్ని నోటికి అందిస్తూ ఆయనపై తనకున్న పేమాభిమానాన్ని చాటుకుంది. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని చేతులు వణుకుతున్నా కూడా ఎలాగైనా తన భర్తకు ఆహారాన్ని ఇవ్వాలనే తపనతో తినిపిస్తుంది. కేవలం 15 సెకన్లు ఉన్న ఈ వీడియో ఓ జీవితకాలం మొత్తం వారు పోగేసుకున్న ఆప్యాయత, అనురాగాలు, ప్రేమను కళ్లకు కట్టినట్లు ఉంటుంది.

ఈ వీడియోను పోస్టు చేసిన డా.సుమిత్ర ఓ ఆసక్తికర కామెంట్‌ కూడా చేశారు. ప్రేమంటే ఏంటి అని ఎవరైనా అడిగితే.. ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పండి అని వ్యాఖ్యానించారు. ఆ వృద్ధ దంపతుల అనుబంధం మాటలకు అందనిదని చెప్పకనే చెప్పారు. ఇక వీడియో ఎంతగా వైరల్‌ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వేలల్లో లైక్స్‌ దూసుకొస్తున్నాయి. నిజమైన ప్రేమంటే ఇది.. అంటూ కొందరు.. జీవన పోరాటంలో బిజీబిజీగా గడిపిన వారిని వృద్ధాప్యం మరింత దగ్గర చేసిందని మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల రూపంలో ప్రశంశలు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -