Mumbai: లోకల్‌ ట్రైన్‌లో వృద్ధురాలు బతకు పోరాటం..

Mumbai: కొందరు ఓ వయస్సు వచ్చే వరకు పనిచేసి వయస్సుపై బడిన తర్వాత ఇంటికే పరిమితమవుతున్నారు. మరి కొందరు వారు బతికి ఉన్నంతా కాలం బతుకుతో పోరాటం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సామాన్యంగా వృద్ధాప్యం వస్తే ప్రతి ఒక్కరికి విశ్రాతి వయస్సు వచ్చినట్టే. అలాంటి వారు ఇంట్లో ఉంకి పరిమితమైపోతారు. కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం ఏడు పదుల వయస్సు వచ్చినా కూడా తన బతుకు బండిని లాగేందుకు రైలులో చిప్స్, బిస్కెట్లు, పల్లిలు అమ్ముకుంటున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ముంబయికి చెందిన ఓ మహిళ వృద్ధాప్యంలోనూ బతుకు పోరాటం చేస్తోంది. అక్కడి లోకల్‌ ట్రైన్‌లలో చిప్స్‌ ప్యాకెట్లు, బిస్కెట్లు పల్లీలు, వాటర్‌ పాకేట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.

వేకువజామున లేచి తన సామగ్రి తీసుకుని రైల్వే స్టేషన్లకు చేరుకుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీ లోకల్‌ ట్రైన్‌ ఎక్కి వాటిని విక్రయిస్తోంది. లోకల్‌ ట్రైన్‌లో బిస్కెట్ల అమ్ముతుండగా ఓ యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది బాగా వైరల్‌ అయింది. సోమవారం రాత్రి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన వీడియోను ఇప్పటి వరకు 72 వేల మందికి పైగా వ్యూవర్స్‌ చూశారు. దాదాపుగా 5 వేలకు పైగా మంది లెక్‌ చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వృద్ధాప్యంలోనూ కష్టపడుతున్న మహిళ స్ఫూర్తికి హ్యాట్సాప్‌ అంటు కొందరు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతీ..యువకులకు ఈ బామ్మా ఆదర్శంగా నిలుస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకొచ్చి ఆ వృద్ధురాలి వివరాలు ఇస్తే తాము సహాయం చేస్తామని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -