Election Commission: సంచలన నిర్ణయం దిశగా ఈసీ.. రెండు చోట్ల పోటీకి నో ఛాన్స్?

Election Commission: ఈసీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలకు భారీ షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిబంధనల్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇందకు గాను మరింత వేగం పెంచింది. అందులో భాగంగా త్వరలో ఈసీ సంచలన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఒక వ్యక్తి ఒకే చోట పోటీ చేసేలా నిర్ణయం తీసుకోనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అలాంటి నిబంధన లేకపోవడం చాలామంది రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఒక చోట ఓడిపోయినా.. ఒక చోట గెలుస్తామనే దీమాతో ఇలా పోటీ చేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఈసీ భావిస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నిలక సంఘం లేఖ రాసింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ లేదా లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా షరతు విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను పక్కన పెడుతూ వస్తున్నాయి. వివిధ కారణాలతో ప్రభుత్వాలు ఈసీ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు.

ఒకే అభ్యర్థి రెండు నియోకవర్గాల్లో పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఉపఎన్నిక నిర్వహించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఎన్నికల నిర్వహణకు చాలా ఖర్చు అవుతాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రజాథనం వృథా అవుతుందని, ఈ నిబంధనలను రద్దు చేయాలని ఎప్పటినుంచో ఈసీ ప్రతిపాదిస్తుంది. పెద్ద సంఖ్య పోలింగ్ కోసం సిబ్బంది వినియోగించాల్సి ఉంటుందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఈసీ కోరుుతూ వస్తుంది.

అలాగే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ముందుగా అసెంబ్లీకి పోటీ చేయడం, తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ పదవికి రాజీనామా చేయడం లాంటికి కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీ కంటే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు మరింత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది.

కాగా ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశంలోని చాలామంది నేతలు రెండు చోట్ల పోటీ చేశారు. 2019 లోుక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, అమేథి నియోజకర్గాల నుంచి పోటీ చేయగా.. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంతో పాటు గుజరాత్ లోని వడోదరా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల మోడీ విజయం సాధించారు. ఇక గతంలో ఇందిరాగాంధీ, అద్వాని, సోనియాగాంధీ, ఎన్టీఆర్, లాలాప్రసాద్ యాదవ్, నవీన్ పట్నాయక్, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్లు కూడా ఒకే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. ఇక కేసీఆర్ కూడా గతంలో రెండు చోట్ల పోటీ చేశారు.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -