Electoral Bonds: ఎన్నికల బాండ్లపై రగడ.. అసలు లబ్ధి బీజేపీకేనా?

Electoral Bonds: దేశంలోని రాజకీయ పార్టీలు పారదర్శకంగా లేని ఆదాయ మార్గాలను అవలంబించకుండా అడ్డుకునేందుకు ఎన్నికల బాండ్లను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇది కేవలం అధికర పార్టీ అయిన బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరడం కోసం తెచ్చిన పథకమని ప్రతిపక్షాలు, మేధావి వర్గం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సైతం అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజాస్వామ్యానికి దొడ్డిదారి అని పిటిషనర్లు పేర్కొంటున్నారు. ఎన్నికల బాండ్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై త్వరలో సుప్రీం విచారణ చేపట్టే చాన్స్ ఉంది.

నిర్ణీత కాల పరిమితితో ఈ బాండ్లు వడ్డీ రహితంగా ఉంటాయి. వీటి విలువ సుమారు రూ.1,000 నుంచి రూ.కోటి వరకు ఉంటాయి. వీటిని ప్రభుత్వరంగ బ్యాంకులు కొనొచ్చు. ఏడాది పొడవునా నిర్దేశించిన వేళల్లో విక్రయిస్తూ ఉంటారు. ప్రజలు, సంస్థలు వీటిని కొని రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందించవచ్చు. 15 రోజుల్లోగా వీటిని పార్టీలు బ్యాంకుల్లో జమచేసి డబ్బు తీసుకోవచ్చు. ఇందులో ఒక మెలిక పెట్టారు. అదేంటంటే.. త సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ లేదా రాష్ట్ర అసెంబ్లీలో 1 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొంది ఉండాలనే కండిషన్ విధించారు.

19 విడతల్లో 9,407 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిక మొత్తంలో లబ్ధి పొందినట్లు స్పష్టమైంది. నాలుగింట మూడొంతుల సొమ్ము ఆ పార్టీకే వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది శాతమే నిధులు దక్కాయి. రాజకీయ పార్టీలు నల్లధనం చేకూర్చుకోకుండా అడ్డుకునేందుకు ఈ పథకం తెచ్చారు. అయితే, ఇప్పుడు పూర్తి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందనే అపవాదు మూటగట్టుకుంది.

అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారనే వివరాలు ప్రజల ముందు ఉంచడం లేదు. ఎవరికి వీటిని ఇస్తున్నారో స్పష్టత లేదు. అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవిగా విమర్శలు గుప్పుమంటున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

YS Jagan: జగన్ తప్ప ఎవరూ కష్టపడటం లేదా? అందుకే ఇలాంటి ఫలితాలా?

YS Jagan: రాజకీయాల తీరే వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఏ నాయకుడు ఆకాశానికి ఎగురుతాడో, ఏ నాయకుడు పడిపోతాడో అస్సలు లెక్క గట్టలేం. ఇదంతా ప్రజల దీవెనల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా...
- Advertisement -