Jabardasth Emmanuel: అనంతపూర్ వైసీపీ ఎమ్మెల్యేపై ఇమ్మాన్యుయేల్ కామెడీ.. చివరకు?

Jabardasth Emmanuel: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఇమాన్యుల్ కూడా ఒకరు. మొదట ఇమాన్యుల్ కి సరైన గుర్తింపు లభించలేదు. కానీ వర్ష తో జంటగా స్కిట్లూ చేయటంతో వీరిద్దరూ జంటగా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అప్పటినుండి ఇమాన్యుల్ వర్ష జంటగా చేసే స్కిట్లకు జబర్దస్త్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా వర్ష మీద ఇమాన్యుల్ వేసే పంచలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇమాన్యుల్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.

ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో సుధీర్, ఆది వంటి స్టార్ కమెడియన్లు లేకపోవడంతో ఇమాన్యుల్ లాంటి వారికి మంచి అవకాశాలు లభిస్తున్నా యి.అయితే జబర్దస్త్ లో అప్పుడప్పుడు సినిమా హీరోలను రాజకీయ నాయకులను అనుకరిస్తూ స్కిట్లు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో వీరు చేసే స్కిట్ల వల్ల ఆ సెలబ్రెటీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. గతంలో కూడా ఇలా స్కిట్లు చేయటం వల్ల కొంతమంది కమెడియన్లు ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

ఇక తాజాగా ఇమాన్యుల్ కూడా వైసిపి ఎమ్మెల్యేని అనుకరిస్తూ స్కిట్ చేశాడు. దీంతో ఇమాన్యుల్ అందరి చేత బాగా తన్నులు తిన్నాడు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఇమాన్యుల్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని అనుకరిస్తూ స్కిట్ చేశాడు.స్కిట్లో భాగంగా ఇమాన్యుల్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాగా గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఇమాన్యుల్ కూడా అలాగే నటించాడు.

 

ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ ఎమ్మెల్యే మాదిరి గెటప్ వేసి స్కూల్ పిల్లాడిగా ఒక బాబును పెట్టాడు. ఆ తర్వాత అచ్చం ఎమ్మెల్యే లాగే బాబును కర్రతో కొట్టడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. అయితే స్కిట్ ముగిసే సమయానికి కమెడియన్లంతా చేరి ఇమ్మాన్యుయేల్ ను చితక్కొట్టారు. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డిని అనుకరిస్తూ ఇమాన్యుల్ ఇలా స్కిట్ చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు ఇమాన్యువల్ పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -