God Father: ఆ సెంటిమెంట్ నిజమైతే గాడ్ ఫాదర్ మూవీ డిజాస్టర్.. చిరుకు షాక్ అంటూ?

God Father: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తమ సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు.సినిమా టైటిల్ విషయంలో కానీ హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతల విషయంలో కానీ కొన్ని సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇలాంటి సెంటిమెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందని లేదా ఫ్లాప్ అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ ఉంది. మెగా హీరోలు ఇంగ్లీష్ టైటిల్స్ తోవారి సినిమాలు విడుదల చేస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది.

ఈ క్రమంలోని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్, స్టాలిన్, మాస్టర్, డాడీ,స్టేట్ రౌడీ వంటి సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా రామ్ చరణ్ విషయంలో కూడా ఈ ఇంగ్లీష్ సెంటిమెంట్ వారికి చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.మగధీర వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అదేవిధంగా బ్రూస్లీ సినిమా కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తో విడుదలై ఫ్లాప్ అయ్యాయి.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి ఇంగ్లీష్ సెంటిమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ గా ఉందని అందరూ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాను కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా పట్ల కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా విషయంలో కూడా ఇంగ్లీష్ సెంటిమెంట్ పునరావృతం అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని కొందరు ఆందోళన చెందగా మరికొందరు మాత్రం ఇలాంటివన్నీ ఒట్టి మూఢ నమ్మకాలేనని కంటెంట్ బాగుంటే టైటిల్ ఎలా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -