ఎస్ ఆర్ కె అనే సినిమాతో కన్నడ చిత్రానంగా ప్రవేశం చేసింది ఈషా రెబ్బ. తరువాత ఈమెతెలుగులో బందిపోటు, అమీతుమీ, మాయా మాల్, అరవింద సమేత, దర్శకుడు తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈ సినిమాలు ఏవి ఆమెని హీరోయిన్ గా ఒక రేంజ్ కి తీసుకు వెళ్లలేకపోయాయి.
చాలాకాలం తర్వాత సెకండ్ హీరోయిన్ గా మళ్లీ తన కెరీర్ ని ప్రారంభించింది. గ్లామర్ రూల్స్ ని పెద్దగా టచ్ చేయని ఈశా ఇటీవలి కాలంలో అదిరిపోయే లుక్కుతో కుర్ర కారుని హీటెక్కిస్తోంది. అరవింద సమేత సినిమాలో ఆమె పాత్ర అందుకు ఉదాహరణ. మధ్యనే మలయాళం లో హీరోయిన్ గా ఒక సినిమా చేసింది.
ఇంతకీ విషయం ఏమంటే కాస్టింగ్ కౌచ్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో చర్చ నడుస్తుంది. దీనికోసం మీ టు అంటూ పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు కొందరు నటీమణులు. దాని గురించే ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది హీరోయిన్ ఈషా రెబ్బ. మామూలుగానే తెలుగు వాళ్లకి హీరోయిన్ గా ఛాన్సులు రావు అంటూ ఉంటారు.
అందుకు కారణం ఉంది తెలుగు అమ్మాయిలు ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వరు. వారికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. నేను కూడా అలాగే నాకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాను. ఇప్పటివరకు నాకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఉన్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను ఇతర భాషలలో కూడా ఆఫర్లు రావడంతో నా కెరియర్ కి ఇప్పట్లో డోకా లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ.