Sameer: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ సమీర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ఈటీవీ లో చాలా సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. బుల్లితెర ప్రేక్షకులతో సమీర్ కి ఉన్న ర్యాపో అంతా ఇంతా కాదు. అప్పటి బుల్లితెర ప్రేక్షకులను ఒక రేంజ్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు సమీర్. ఇక సమీర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా హౌస్ లో అడుగు పెట్టాడు.
అలా ఒకప్పుడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన సమీర్ అనంతరం సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టాడు. సిల్వర్ స్క్రీన్ లో పలు సహాయ పాత్రలు చేస్తూ వెండి తెర ప్రేక్షకులను కూడా బాగానే మెప్పిస్తున్నాడు. ఇక సమీర్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా సమీర్ తన లైఫ్ లో జరిగిన ఒక చేదు అనుభవం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్ తాను ఈటీవీలో చేస్తున్న సమయంలో నాకు ఒక లవ్ ఏఫైర్ ఉందని నాపై లేనిపోని నింద వేసి నా గురించి సుమన్ గారికి ఎవరో తప్పుగా చెప్పారు. సుమన్ గారు ఈ విషయంలో నన్ను ఏమాత్రం అడగకుండా నన్ను ఈటీవీ నుంచి బాన్ చేశారు అని సమీర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం సమీర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్లో వైరల్ గా మారాయి.
ఇక సమీర్ వ్యక్తిగత విషయానికొస్తే ఇంతికాబ్ హసన్, మహాలక్ష్మి దంపతులకు ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో జన్మించాడు. ఇక అతని చెల్లి పేరు అపర్ణ. తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో సమీర్ చెన్నైలోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అక్కడే తన స్కూలింగ్ ని కూడా కంప్లీట్ చేశాడు. ఇక విశాఖపట్నం బుల్లయ్య కాలేజీలో సమీర్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక సమీర్ భార్య పేరు అపర్ణ.