Nagababu: నిహారిక విడాకులు తీసుకున్నా నాగబాబు ఫీల్ కారా.. ఏం జరిగిందంటే?

Nagababu: మెగా డాటర్ నిహారిక విడాకుల విషయం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిహారిక మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా రికార్డు సొంతం చేసుకున్నారు.కెరీర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్ గా మారి వెండితెరపై సందడి చేశారు. అయితే వెండి తెరపై ఈమెకు పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈమె కుటుంబ సభ్యులు తనకు 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక సినిమాలలో నటించాలని పిచ్చి ఉన్నప్పటికీ అత్తింటి వారు ఆంక్షలు పెట్టడంతో నిహారిక సినిమాలపై ఉన్న పిచ్చి తగ్గించుకోలేక నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇలా నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అయితే తన భర్త వెంకట చైతన్యకు నిహారికకు మధ్య గొడవలు వచ్చాయని తద్వారా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు మరింత బలం అవుతున్నాయి.ఇలా కూతురు విడాకుల వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్న కూడా ఇప్పటివరకు ఈ విషయం గురించి నాగబాబు ఏ విధంగాను స్పందించలేదు.

 

మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక చిన్నమాట అన్నా వెంటనే రియాక్ట్ అయ్యే నాగబాబు కూతురు విషయంలో ఎందుకు ఇలా ఉన్నారనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇలా విడాకులు అంటూ కూతురు కెరియర్ నాశనం అవుతున్న కూడా నాగబాబు పట్టించుకోకుండా ఉండడానికి అసలు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు. అయితే నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పబ్ లో పోలీసులకు దొరికిపోవడంతోనే ఈమె కాపురంలో మనస్పర్ధలు తలెత్తాయని అందుకే విడాకుల వరకు వెళ్లిందని తెలుస్తుంది. మరి నిహారిక విడాకుల గురించి ఇంతవరకు నిజముందో తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -