Heroes: స్టార్స్ అయినా కాళ్లు మొక్కే సీన్స్ లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే!

Heroes: సినిమా వేషాల కోసం తిరిగేటప్పుడు ఎలాంటి సీనైనా చేస్తాను అని హీరోలైన వాళ్ళు తర్వాత వాళ్ల ఇమేజ్ కి డామేజ్ అయ్యే సీన్ ఒక్కటి వచ్చినా నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటూ తప్పించుకుంటారు. నేను వాడి కాళ్లు పట్టుకోవడం ఏమిటి, లేకపోతే వాడు నన్ను కొట్టడం ఏమిటి ఇలా చేయటం నా ఫ్యాన్స్ కి నచ్చదు అంటూ అహంభావాన్ని చూపిస్తారు. అయితే కొందరు స్టార్ నటులు మాత్రం సీన్ డిమాండ్ చేయటం మేరకు తమ స్థాయి తగ్గించుకొని ఎదుటివాళ్ళు కాళ్లు పట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడరు.

 

అలాంటి స్టార్ నటులు ఎవరో చూద్దాం. ముందుగా వెంకటేష్ ని తీసుకుంటే అతను ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మనందరికీ తెలిసిందే. అయితే నారప్ప సినిమాలో సీన్ డిమాండ్ చేయటం మేరకు అతను ఊరి వాళ్ళందరి కాళ్లు పట్టుకోవడం కోసం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అలాగే సలార్ సినిమాలో ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం శత్రువు కాళ్లు పట్టుకుంటాడు. ఈ సీన్ చేసేటప్పుడు ప్రభాస్ డూప్ నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చాడంట కానీ వద్దు నేనే చేస్తాను అంటూ ఏమాత్రం భేషజం చూపించకుండా ఆ సీన్ చేశాడంట ప్రభాస్.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికి వస్తే జైలర్ సినిమాలో తన కొడుకు పాత్రధారి కి షూ పాలిష్ చేయవలసి వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం ప్రదర్శించకుండా పాత్రలో ఇమిడిపోయి ఒక కన్న తండ్రి కొడుక్కి ఎంత అపురూపంగా చేస్తాడో అలాగే చేశాడంట రజనీకాంత్. ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే కట్టప్ప వేషధారణ వేసిన నటుడు సత్యరాజ్ తమిళంలో చాలా పెద్ద హీరో.

 

తర్వాత తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తన నెత్తి మీద ప్రభాస్ కాలు పెట్టే సీన్ ఉన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ సీన్ చేశాడంట. నిజానికి రాజమౌళి కి ఆ సీన్ చెప్తే చేస్తారో చేయరో అనే అనుమానం వచ్చింది అంట. కానీ సీన్ డిమాండ్ చేస్తే ఏ పాత్ర చేయడానికి అయినా సిద్ధమే అంటూ ఆ సీన్ చేశారంట సత్యరాజ్. వీళ్ళు కదా ఆర్టిస్టులు అంటే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -