IAS: ఇలాంటి కొడుకును కన్న ప్రతి తల్లీ అదృష్టవంతురాలే కదా!

IAS: కెరియర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పలువురికి ఆదర్శంగా నిలచాలన్న చదువు ఒకటే మార్గం. అయితే ఉన్నత చదువులు చదువుతూ మంచి కొలువులో స్థిరపడాలి అంటే కష్టపడటం ఒక్కటే మార్గం. ఇలా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వారి కష్టాలను అధిగమించి ఉన్నత లక్ష్యాలను సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇలాంటి కోవకు చెందిన వారే సురపాటి ప్రశాంత్ కుమార్.ఆరో తరగతి లోనే తండ్రి చనిపోతే తల్లి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కష్టపడి ఐఏఎస్ అయ్యారు.

పార్వతీపురానికి చెందిన ప్రశాంత్ కుమార్ ప్రస్తుతం ట్రైనీ కలెక్టర్ గావిధులు నిర్వహిస్తూ ఆత్మకూరు మండలానికి వచ్చారు. దీంతో ఆయన తన సక్సెస్ స్టోరీని తెలియజేశారు. తన తండ్రి బాబురావు ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయ్యారని తెలిపారు. అయితే తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తన తండ్రి మరణించారని ప్రశాంత్ కుమార్ తెలిపారు. తండ్రి మరణించడంతో తల్లి తమ బాధ్యతలను తీసుకుందని తెలిపారు.

 

తన తల్లి ఏఎన్ఎం గా పనిచేస్తూ మమ్మల్ని చదివించిందని ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.అను ఏడో తరగతి వరకు పార్వతీపురం లోనే చదువుకున్నానని పదవ తరగతి నాసిక్ లో చదువుకున్నాను అని తెలిపారు. వైజాగ్ వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 2017 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.అమ్మ అన్నయ్యను, నన్ను ఎంతో కష్టపడి చదివించిందని తెలిపారు.

 

తమ జీవితంలో తనకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలను సదుపాయాలను సమకూర్చి మా కోసం ఇంత కష్టపడిన అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో తాను పట్టుదలగా ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యానని,ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ చాలా కష్టపడి చదివి అమ్మ కళ్ళల్లో ఆనందం చూశానని ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కుమార్ తన సక్సెస్ స్టోరీని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -