Mahesh-Namrata: ఆ పని చేస్తే మాత్రం నమ్రతకు అస్సలు నచ్చదా?

Mahesh-Namrata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలలో టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నాడు. గత ఏడాది మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటించనున్నాడు మహేష్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. ఇది ఇలా ఉంది తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. చూడ్డానికి ఎంతో స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ బాబుకి ఒక బ్యాడ్ అలవాటు ఉందట. అదేమిటంటే స్మోకింగ్. అవును మీరు విన్నది నిజమే మహేష్ బాబుకి స్మోకింగ్ అలవాటు ఉండిందట. అయితే మహేష్ బాబుతో ఆ అలవాటు మానిపించడానికి తల్లి ట్రై చేయగా తండ్రి కృష్ణ కూడా పలు సార్లు హెచ్చరించాడట.

 

యంగ్ ఏజ్ లో వచ్చిన అలవాటు కావడంతో ఆ అలవాటును మార్పించడానికి చాలా కష్టపడ్డారట. అంతేకాకుండా మహేష్ బాబు నమ్రతాని ప్రేమిస్తున్న సమయంలో కూడా స్మోకింగ్ అలవాటు ఉందట. నమ్రత కూడా ఆ బ్యాడ్ అలవాటును మాన్పించడానికి చాలా ట్రై చేసి పెళ్లికి ముందే మహేష్ బాబుతో అలవాటుని మానిపించి అనంతరం పెళ్లి చేసుకుంది నమ్రత. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలామంది మహేష్ బాబు కి స్మోకింగ్ అలవాటు ఉంది అని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -