Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక మీడియా ఒక పార్టీకి కొమ్ము కాయటం తప్పు కాదు కానీ వేరే వాళ్లని కించపరచడం అనేది చాలా పెద్ద తప్పు. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారం అంటూ కొందరు మీడియాని ఎండగడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్ నేత, అయితే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు, పైగా రాజ్యసభ పదవీకాలం ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కొనసాగలేదు. రాజకీయాలకి నేను దూరం, నేను ఏ పార్టీలోనూ లేను. జనసేన పార్టీలో కూడా చేరలేదు కానీపవన్ కళ్యాణ్ నా తమ్ముడు కాబట్టి అతనికి అన్న గా నా మోరల్ సపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పారు చిరంజీవి. అయినా ఆయనని ఒక కాంగ్రెస్ నేతగానే భావిస్తూ ఆయనపై అనేక విమర్శలు చేస్తున్నారు చాలామంది.

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా బాహటంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకకపోయినా ఆయన మీద విషం చిమ్మటం మాత్రం ఆగటం లేదు. ముఖ్యంగా వైసిపి అనుకూల వర్గం వారు చిరంజీవిని కాంగ్రెస్ నేతగా చూపిస్తూ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసి భాజపా, తెదేపా అభ్యర్థుల తరఫున రాజకీయంగా వెనకేసుకొస్తున్నారని సదరు మీడియాలో నాల్ని ప్రచారం చేస్తున్నారు.

నిజానికి చిరంజీవి బాహాటంగానే నేను కేవలం తమ్ముడు ఎదుగుదలను ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు. అందుకే తమ్ముడికి ఐదు కోట్లు విరాళం కూడా ఇచ్చారు, అవి కూడా కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ చేస్తున్న సాయానికి అవసరమవుతాయని ఇచ్చారు. దానిని మీడియా వక్రీకరించి రాయడం సమంజసమా.. రాజకీయ పార్టీలకి మీడియా సంస్థలు అమ్ముడుపోయాయి అని ప్రజలు మీడియాపై తుమ్మెత్తి పోయటంలో తప్పే లేదు, ఇదేనా పాత్రికేయమంటే అంటూ నిలదీస్తున్నారు సదరు ప్రజానీకం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -