Prudhvi Raj: జ‌న‌సేన‌లో చేరాలంటే భ‌ర‌ణం చెల్లించ‌డ‌మే అర్హ‌తా.. పృథ్వీపై విమర్శలు!

Prudhvi Raj: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ పృథ్వీరాజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లి సినిమాతో ఇండస్ట్రీలో విలన్ గా పరిచయమైన పృథ్వీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు నాట నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. పెళ్లి సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సొంతం చేసుకున్నాడు ఇతడు. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు.

ఇక పృథ్వీ లో గొప్పతనం ఏమిటంటే.. తన పాత్రలో తాను నవ్వకుండా తన మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు ఇతడు. అనంతరం రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. ఇటీవల పృథ్వీ రాజ్ ను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఫ్యామిలీ కోర్ట్ పృథ్వీ కు ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చింది.

ప్రతినెల 8 లక్షల చొప్పున భరణం కింద తన భార్య శ్రీలక్ష్మికి చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు జడ్జ్ ప్రియదర్శిని తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పృథ్వీ రాజ్ ను ఆయుధంగా చేసుకొని జనసేనను ప్రత్యర్ధులు ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు. జనసేన లో చేరాలంటే భార్యలకు భరణం చెల్లించడమే అర్హతానా? అని కొందరు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని దెప్పి పొడుస్తున్నారు.

ప్రస్తుతం పృథ్వీరాజ్ కు సంబంధించిన కోర్టు తీర్పు ఇండస్ట్రీలో టాప్ ట్రేండింగా మారింది. ఏదేమైనా పృథ్వీరాజ్ ను మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఏకీపారేస్తున్నారు. మరి తన గురించి వచ్చే విమర్శల గురించి ఆయన స్పందిస్తాడో లేదో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -