Simbu: శింబుతో నా పెళ్లి వాళ్ళిద్దరి ముందే జరుగుతుందంటున్న ఆ బ్యూటీ!

Simbu: టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ నటుడు శింబు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. మన్మధ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన శింబు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ శింబు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కాలం మెలగలేదు. ఇక శింబు నిర్మాతగా కూడా తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలను నిర్మించాడు.

మరి ఇటీవలే శింబు ఇటీవల వేందు తానిందాతు కాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శింబు కు ఊహించిన విధంగా సక్సెస్ అందుకుంది. ఇక ఈ ప్రమోషన్ నేపథ్యంలో శింబుకి నాకు పెళ్లి అంటూ ఆ హీరోయిన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సిద్దూ ఇద్నానీ గురించి మనందరికీ తెలిసిందే. జంబలకడిపంబ సినిమా ద్వారా టాలీవుడ్ లో పరిచయం అయింది అమ్మడు.

కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంతగా కనిపించలేదు. ఇక ఈ అమ్మడు ఏకంగా శింబుతో వేందు తానిందాతు కాడు సినిమాలో నటించడానికి ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో భారీ స్థాయి సక్సెస్ ను తన సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ నేపథ్యం లో శింబుతో రిలేషన్ గురించి వచ్చే రూమర్లపై సిద్ది ఇద్నానీ ను కొందరు ఒక ప్రశ్న అడిగారు. దాంతో సిద్ధి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.

తన పై డేటింగ్ రూమర్లు రావడంతో ఒకసారి గా ఈ అమ్మడు అసహనం వ్యక్తం చేసింది. అవును శింబుతో నాకు రిలేషన్ ఉంది అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మా ఇద్దరి పెళ్లి రజనీకాంత్, ఉదయనిది స్టాలిన్ ముందు జరుగుతుందని ఈ అమ్మడు ఒక్కసారిగా చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో మాత్రం కొన్ని రోజులుగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారు అన్నట్లు, అంతేకాకుండా డేటింగ్ లు కూడా చేస్తున్నారు అని వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -