CM Jagan: సీఎం జగన్ విషయంలో ఫ్యాన్స్ ఫైర్.. అక్కడే తప్పు జరుగుతోందా?

CM Jagan: ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను ఎన్నికలు వస్తున్న ఆరు నెలల ముందు నిర్వహిస్తే దానిని మోసం అంటారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరిస్తే వారిని సరైన నాయకుడు అంటారంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన నీతి వ్యాఖ్యలే ఇవి. అయితే ప్రస్తుతం ఈయన కూడా అదే చేస్తున్నారని ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు తను కూడా చంద్రబాబు ధోరణిలోనే నడుస్తూ తీవ్ర స్థాయిలో ప్రజలు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈయన అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ఎన్నో ఫ్యాక్టరీలకు విమానాశ్రయాలకు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు.

 

ఇలా మరికొన్ని భూమి పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే ఇలా 15 రోజులకు ఒకసారి ఏదో ఒక శంకుస్థాపన అంటూ జగన్ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేస్తున్నారు.ఇలా భూమి పూజ శంకుస్థాపన అంటూ ఈయన చేస్తున్నటువంటి హడావిడి అభిమానులలో కొంత పాటి నిరుత్సాహానికి గురయ్యేలా చేస్తోంది.ఇలా 15 రోజులకు ఒకసారి భూమి పూజ శంకుస్థాపన అంటే ఎలా శంకుస్థాపన అయితే చేశారు మరి వాటిని నిర్మించేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

శంకుస్థాపనలు చేసే వదిలేయడం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేసే పని అయితే జగన్ కూడా అలాంటి రాజకీయ నాయకుడైనని నిరూపించుకుంటున్నారు. తాను ప్రజల మనిషినని ప్రజల కోసం కృషి చేసే నాయకుడు అని చెప్పుకొని జగన్ సైతం కేవలం మాటల వరకు మాత్రమేనని చేతలలో ఏమీ లేదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి ఏ ఒక్క నిర్మాణం అయిన పూర్తి చేశారా అంటే లేదని చెప్పాలి. ఇలా అందరిలాగే జగన్ సైతం ఈ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారని ఇలా అయితే ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం కోల్పోవలసి వస్తుందని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -