Mokshagna Teja: మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ట్విస్ట్ అదేనా?

Mokshagna Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇక నందమూరి తారక రామారావు వారసులుగా నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

అయితే బాలకృష్ణ మాత్రం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ ఇదివరకే క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా 2023లో మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మోక్షజ్ఞ ఎప్పుడు మీడియాకి దూరంగా ఉంటున్నాడు. అంతేకాకుండా మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు.

ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ… ఈ సినిమా డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు. బాలయ్య వారసుడు కోసం నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -