Nandamuri Mokshagna: మోక్షజ్ఞ లుక్ మారేది ఇంకెప్పుడు.. నిరాశ పడుతున్న నందమూరి ఫ్యాన్స్!

Nandamuri Mokshagna: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి అతడి నటన గురించి పెద్దగా పరిచయమక్కర్లేదు. నటన లో తండ్రికి తగ్గ కొడుకుగా బాలకృష్ణ తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా బాలయ్య బాబు సినీ అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినీ రంగంలో అడుగుపెడతాడని ఎన్నో రకాల పుకార్లు వస్తున్నాయి. దీని గురించి నందమూరి బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా మోక్షజ్ఞకు నటనకు కావలసిన అన్ని విషయాల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపాడు. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టర్కీ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో మోక్షజ్ఞ ఒక వైట్ టీ షర్ట్ ధరించి కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలో మోక్షజ్ఞ బాడీ ఫిట్నెస్ గా కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మోక్షజ్ఞ ఇంకా హీరో లుక్ లో కనిపించకపోవడంతో చాలా బాధపడుతున్నారు. మోక్షజ్ఞ నటనకు గాను శిక్షణ తీసుకుంటున్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మోక్షజ్ఞ నటనకు సంబంధించిన పలు రకాలుగా శిక్షణ పొందుతున్నాడని చాలా కాలం క్రితం వెల్లడించారు. అయినప్పటికీ మోక్షజ్ఞ లుక్ లో ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు రాలేదని నందమూరి బాలకృష్ణ అభిమానులు కొంచెం నిరాశపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -