Fans Fire: ఆట ఎలాగూ రావడం లేదు.. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా?!

Fans Fire: టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్ మీద ఈ మధ్యన విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. టీమిండియాలో బాగా రాణిస్తాడని అందరూ అతడి మీద అంచనాలు పెట్టుకోగా.. అతడు ప్రతి మ్యాచులోనూ నిరుత్సాహ పరుస్తున్నాడు. ఆ నిరుత్సాహ పరుస్తున్న టీమిండియా క్రికెటర్ ఎవరో కాదు.. రిషబ్ పంత్.

ధోనీ శిష్యుడిగా, అతడి స్థానంలో అదరగొట్టేస్తాడని అనుకున్న రిషబ్ పంత్.. పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు. వరుసగా టీమిండియాలో ఆడే అవకాశాలు వస్తున్నా కానీ తన చెత్త పర్ఫామెన్స్ తో విమర్శకులకు అవకాశమిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో గొప్పగా ఆడిన మ్యాచులు, టీంని గెలిపించిన ఆటతీరును ఇప్పటి వరకు పంత్ చూపించలేదు.

అయితే తాజాగా కివీస్ తో జరిగిన చివరి వన్డేలో పంత్ ఆడిన విధానాన్ని చూసిన జనాలు మాత్రం తిట్టుకుంటున్నారు. అసలు రిషబ్ పంత్ కు ఏమైంది అని అందరూ చర్చించుకుంటున్నారు. కివీస్ తో జరిగిన వన్డేలో టీమిండియా ఓపెనర్లు కొద్ది స్కోర్ వద్దే చేతులు ఎత్తేశారు. దీంతో క్రీజ్ లోని శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ ఉన్నాడు.

బరిలోకి దిగిన రిషబ్ పంత్ 15 బాల్స్ లో రెండు ఫోర్లు కొట్టి 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మిచెల్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో వేసిన షార్ట్ పిచ్ బాల్ ను పంత్ ఫుల్ షాట్ ఆడాడు. నిలకడగా ఆడాల్సిన టైంలో తనకు ఏమాత్రం అనుకూలంగా లేని షార్ట్ పిచ్ బాల్ ను పంత్ ఆడటం ఏంటని అందరూ విమర్శిస్తున్నారు. ఆడటం ఎలాగూ రాదు.. కనీసం క్రీజ్ లో కాసేపు వికెట్ ని ఆపుకొని ఉంటే కాన్ఫిడెన్స్ పెరిగేదని, నెమ్మదిగా కనీసం హాఫ్ సెంచరీ అయినా చేసే వాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన పంత్ ఆటతీరు మారడం లేదని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -