Fans: ద్వేషించే అభిమానులు లేని ఘనత వెంకీకి మాత్రమే సొంతమా?

Fans: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తారలు ఉన్నప్పటికీ మనకు నచ్చిన హీరో హీరోయిన్లు కొంతమంది మాత్రమే ఉంటారు.
ప్రత్యేకించి ఎటువంటి కారణం లేకపోయినా మనం కొందరు హీరోలను ఇష్టపడతాం. మరి కొందరిని అనవసరంగా ద్వేషిస్తాం. అందుకే కొందరు హీరోలకి ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక హీరో ఫ్యాన్స్ పక్క హీరోలను విమర్శించడానికి ఏమాత్రం వెనకాడరు.

కానీ టాలీవుడ్ మొత్తం మీద ఎటువంటి వ్యతిరేకత లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల చేత అభిమానించబడే ఏకైక నటుడు విక్టరీ వెంకటేష్. ఎంతో నిరాడంబరంగా ఉండే వెంకటేష్ ద్వేషించడం ఎవరివల్ల సాధ్యపడదు.
వివాదాలకు ,సమస్యలకు వెంకటేష్ ఎప్పుడు దూరంగా ఉంటాడని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో మంచి బ్యాక్ గ్రౌండ్ తో ఎంటర్ అయిన వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో సక్సెస్ లను చవిచూశాడు. కానీ ఇప్పటికీ అతని వ్యక్తిగత జీవితం కానీ సినిమా జీవితం గాని ఎంతో నిరాడంబరంగా ఉంటుంది.

ఒక మనిషి ఎదిగే కొద్ది వదగాలి అనేదానికి ప్రత్యక్ష నిదర్శనంగా టాలీవుడ్ లో వెంకటేష్ ని చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా ఇండస్ట్రీకి మకుటంలాంటి రామానాయుడు కొడుకు అయినప్పటికీ ఎక్కడ అతను బేషజాలకు పోయిన దాఖలా లేదు. షూటింగ్ పూర్తి చేసుకోవడం తిరిగి ఇంటికి వెళ్ళడం ఇదే వెంకటేష్ రొటీన్ జీవితం. ఆయన సినిమాను ఎంత ప్రేమిస్తాడో కుటుంబానికి అంతకంటే ప్రాధాన్యత ఇస్తాడు.

ఆరుపదులు వయసు దాటుతున్న ఇంకా స్టెప్పులు వేసే హీరోలు ఉన్న టాలీవుడ్ లో నారప్ప , గురు, దృశ్యం లాంటి చిత్రాల ద్వారా తన వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ వెంకటేష్ తనకంటూ ఓ ట్రేడ్ మార్కును సృష్టిస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ ఎప్పుడు కూడా వెంకటేష్ తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలతో గొడవ పడింది లేదు. తనతో పాటు అందరూ ఎదగాలి అనే సానుకూల దృక్పధతో ముందుకు సాగే మనసున్న నటుడు వెంకటేష్.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -