Mahesh-Krishna: ఈ వీడియో చూస్తే కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టాల్సిందే!

Mahesh-Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతితో ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అభిమానులు సైతం తమ అభిమానాన్ని ఎల్లప్పుడూ చూపించుకుంటున్నారు. టాలీవుడ్‌లో సాంకేతికత అభివృద్ధికి, సరికొత్త సినిమాలతో.. లక్షల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 350కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన వారసుడిగా మహేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా నిలదొక్కుకున్నాడు. నటుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు పడుతున్న వేదన వర్ణతాతీతం. ఎందుకంటే ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రిని కోల్పోయారు. వరుస విషాదాలతో కుంగి పోయాడు. గుండె బద్ధలయ్యేంత దుఃఖాన్ని మహేష్ తన పెదవి చాటున దాచేసి.. తన తండ్రి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే మహేష్, కృష్ణ ఫ్యాన్స్ కూడా తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

తాజాగా ఓ వీడియో మహేష్ బాబు అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. కృష్ణ-మహేష్ బాబుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. అయితే అంత ఎమోషనల్ అవ్వడానికి ఈ వీడియోలో అంత ప్రత్యేకత ఏమిటని ఆలోచిస్తున్నారా?. ఈ వీడియోలో కృష్ణ, మహేష్ బాబు నటించిన కొన్ని సన్నివేశాలు, సాంగ్స్ ఉన్నాయి. తండ్రీకొడుకులకు సింక్ అయ్యేలా వీడియోను క్రియేట్ చేశారు. దాదాపు 2.20 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబు తన తండ్రి గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం మహేష్.. కృష్ణ అస్థికలను కృష్ణానది దగ్గర్లోని ధర్మనిలయంలో కలపనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మహేష్.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణానదికి బయలుదేరారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -