NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ మజాకా, మాములుగా ఉండదు మరి…!

NTR30: జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ఫైర్ బ్రాండ్. నందమూరి నట వారసుడిగా, తాతకి తగ్గ మనవడుగా ఆయన ఆశీస్సులతో తెలుగు చలన చిత్ర సీమకి అడుగు పెట్టి టాలీవుడ్ లో అగ్ర కథా నాయకుడిగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా తన డైలాగ్స్ కి తన నాట్యానికి ఫిదా అవ్వని వారు ఎవరైనా ఉంటారా. అందుకే మొదట్లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా నటనలోను, తన మాటలోనూ ఏ మాత్రం తగ్గకుండా లెక్కలేనంత ప్రేమ చూపించే అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తాను వెండి తెర పై కనిపించినా లేక ఏ ఈవెంట్లో కనిపించినా ఎన్టీఆర్ అభిమానుల సందడి మాములుగా ఉండదు. నిజం చెప్పాలంటే అతి తక్కువ కాలంలోనే కోట్ల మంది అభిమానులని సొంతం చేసుకోవడం చాలా కొంత మందికే చెల్లుతుంది. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఇప్పటికే 29 చిత్రాల్లో నటించాడు. తను ఈ మధ్యలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ ఎంతంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఈ హవా తగ్గకముందే ఎన్టీఆర్ 30 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు.

అయితే మరో విషయం ఏమిటంటే ఆ సినిమా గురించి అఫీషియల్ గా ఎంటువంటి ప్రకటన రాకపోయినా ఎన్టీఆర్30 అక్టోబర్ 10 వ తేదీన షూటింగ్ ప్రారంభం కాబోతుందని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. NTR30 హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో సందడి మొదలెట్టేసారు అభిమానులు. ఇక ఎన్టీఆర్ 30 కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో రాబోతుండడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -