Faria Abdullah: షేవ్ చేసుకోలేదా అంటూ కామెంట్.. ఫరియా రియాక్షన్ ఇదే!

Faria Abdullah: ఒకే ఒక్క సినిమాతో కొందరు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతుంటారు. ఆ కోవలోకి వచ్చే హీరోయినే ఫరియా అబ్దుల్లా. స్టార్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తీసిన ‘జాతిరత్నాలు’తో ఆమె క్రేజీ స్టార్ అయిపోయారు. చిట్టిగా క్యూట్ నటనతో కుర్రకారు గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చేసింది ఫరియా. ‘జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్రలో ఆమె పలికించిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. చిట్టి పేరుతోనే ఆమెను తమ మదిలో ముద్ర వేసుకున్నారు.

 

‘జాతిరత్నాలు’ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనిపించారు ఫరియా. అక్కినేని అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’లో ప్రత్యేక పాత్రలో ఆకట్టుకున్నారామె. అలాగే ‘బంగార్రాజు’లో ఐటం సాంగ్ లో తన డ్యాన్సులతో అదరగొట్టారు. ఇటీవల ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించారామె. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

 

సినిమాల సంగతిని అటుంచితే.. యోగాసనాలు, మనుసును ఏకం చేసే మోటివేషన్ కార్యక్రమాల్లోనూ ఫరియా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆమె పంచుకున్నారు. ఇందులో తన సహచర నటుడు హర్ష కోమెంట్ ఫొటోను షేర్ చేశారు. ఆమె ఓ ఆసనం వేస్తూ కనిపించిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ పలు అసభ్యకర కామెంట్లతో రెచ్చిపోయారు.

 

చేసినా మళ్లీ వచ్చింది: ఫరియా
యోగాసనాలు వేస్తూ కనిపించిన ఫరియా ఫొటోపై ఓ నెటిజన్ వల్గర్ గా కామెంట్ చేశాడు. ‘చిట్టి సంకలో షేవ్ చేసుకోలేదా’ అంటూ వ్యాఖ్యలు పెట్టాడు. దీనికి హీరోయిన్ కూడా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ‘చేసినా మళ్లీ వచ్చింది. ఎన్నిసార్లు చేయాలా’ అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చారు. కొందరు ఆ నెటిజన్ పై ఫైర్ అవుతుంటే.. మరికొందరు ఫరియా బోల్డ్ నెస్ కు షాక్ అవుతున్నారు. ఆమెలో ఇంతటి మాస్ యాంగిల్ ఉందా అంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -