Fasting: భక్తే కాదు ఉపవాసం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి!

Fasting: ఉపవాసం మనందరికీ తెలిసిన పద్ధతే. చిన్నప్పటి నుంచీ మన ఇంట్లో వాళ్ళనో చుట్టాలనో ఉపవాసం చేయడం గమనిస్తూ ఉంటాం. కొంత వయసు వచ్చాక మనమూ ఉపవాసం ఉండటం మొదలుపెట్టే ఉంటాం. ఇష్టమైన దేవుడికి మనస్ఫూర్తిగా ఉపవాసం ఉంటే మంచిది అని చాలా మంది నమ్ముతారు. కొంతమంది వారంలో ఒకరోజు క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటారు.

ఉపవాసం పై అధ్యయనం!

మహాశివరాత్రి కావచ్చు,కార్తీక మాస సోమవారం కావచ్చు,భక్తులు ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్తున్నారు. ఉపవాసం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అనే భావన తప్పు అని కూడా అంటున్నారు నిపుణులు. ఉపవాసం మన శరీరాన్ని ఏం చేస్తుందో కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటి సారాంశం ఏంటంటే. ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాదు అనేది పూర్తిగా అపోహ. అయితే ఉపవాసం వారంలో ఒకరోజుకి మించి చేయకూడదు. ఎందుకంటే అది శరీరం మీద దుష్ప్రభావం చూపుతుంది. ఉపవాసం అంటే శరీరం లోకి ఎలాంటి పదార్థం వెళ్లకపోవడం. పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల వంట్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. అసలు ఆహారమే లేకపోతే ఇక కొవ్వు ఎలా వస్తుంది.

ఉపవాసం జీర్ణవ్యవస్థకి కూడా మంచి చేస్తుంది. ఒకరోజు ఆహారం ఉండదు కాబట్టి జీర్ణవ్యవస్థ కి కొంచం రెస్ట్ దొరికినట్టు అవుతుంది. మామూలుగా అయితే రోజూ ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి జీర్ణవ్యవస్థ తరచుగా పనిచేస్తూ ఉంటుంది. దానికి రెస్ట్ ఏమీ ఉండదు. ఉపవాసం ఆ రెస్ట్ దొరికే అవకాశన్ని కలిగిస్తుంది. కొలస్ట్రాల్ రెండు రకాలు అని మనకి తెలిసిందే. ఒకటి మంచి కొలస్ట్రాల్ రెండవది చెడు కొలెస్ట్రాల్. ఉపవాసం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించంలో కూడా ఉపయోగపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -