VishnuPriya: హద్దుల్లేని అందాల విందు.. గ్రీన్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న విష్ణుప్రియ!

VishnuPriya: బుల్లితెర నుంచి వెండితెరకు రావాలనుకుంటున్న వారిలో విష్ణుప్రియ ఒకరు. టెలివిజన్ రంగంలో యాంకర్ గా ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. హుషారైన మాటలు, చలాకీగా ఉంటూ యువతలో క్రేజ్ సంపాదించారు. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలను చూపిస్తూ ఆమె దిగే ఫొటోలు, చేసే వీడియోలకు యూత్ ఆడియెన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

 

నటన, అందంతోపాటు నాట్యంతోనూ విష్ణుప్రియ సందడి చేస్తుంటారు. యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ జోరు పెంచేశారు. ‘వాంటెడ్ పండుగాడు’ సినిమాతో నటిగానూ మూవీ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెట్టారు. సినీ అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్టు చేస్తుంటారామె.

 

ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో విష్ణుప్రియ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో ఆదరణ కనిపిస్తోంది. ఆ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునేందుకు ప్రత్యేకమైన ఫొటో షూట్లు, రీల్స్ అంటూ నానా హంగామా చేస్తుంటుందీ పొడుగుకాళ్ల బ్యూటీ. కొందరు అభిమానులు ఆమెను అరేబియన్ గుర్రమని పిలుస్తూ.. విష్ణు ప్రియ​ అందాన్ని పొగుడుతుంటారు.

 

సినీ చాన్సులు వచ్చేనా..?
ఇటీవల మానస్ నాగులపల్లితో కలసి విష్ణుప్రియ ఓ కవర్ సాంగ్ కూడా చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ఫొటోషూట్లతో చిత్ర రంగంలో చాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా గ్రీన్ డ్రెస్ లో దిగిన ఫొటోలతో మళ్లీ రచ్చ చేస్తోంది. ఇందులో ఆమె గ్లామర్ డోస్ పెంచేసింది. మరి, ఇంతగా అందాల విందు చేస్తున్న విష్ణుప్రియకు సినీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -