Brazil: ఒంటరిగా క్లాస్ రూమ్ లో మహిళా టీచర్.. చివరికి?

Brazil: సాధారణంగా ఉపాధ్యాయులు అంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా అదే కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైన స్టూడెంట్స్ మాట వినని సమయంలో వారిపై అరవడం కొన్ని కొన్ని సార్లు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొందరు స్టూడెంట్స్ ఈమధ్య కాలంలో మితిమీరి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక మాట అంటే వారికి రివర్స్ లో సమాధానం ఇవ్వడం కొట్టారు అంటే వారిపై పగ తీర్చుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు.

తాజాగా కూడా ఒక విద్యార్థి ఒంటరిగా ఉన్న మహిళా టీచర్ పై దారుణంగా ప్రవర్తించి కక్ష తీర్చుకున్నాడు. అసలేం జరిగిందంటే.. బ్రెజిల్ లో అతి పెద్ద నగరం సావోపాలోని ఒక ప్రాంతంలో ఉన్న పబ్లిక్ స్కూల్ లో 71 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా విధులను నిర్వహిస్తోంది. ఇదే స్కూల్ లో 17 ఏళ్ల స్టూడెంట్ చదువుకుంటున్నాడు. అయితే టీచర్ స్టూడెంట్ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ టీచర్ పై మాత్రం స్టూడెంట్ పగపెంచుకున్నాడు. ఆ స్టూడెంట్ టీచర్ పై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతని వెంట తెచ్చుకున్నాడు.

 

తాజాగా క్లాస్ రూమ్ లో టీచర్ ఒంటరిగా ఉండడం చూసి ఆ విద్యార్థి బ్యాగులో ఉన్న తన కత్తిని తీసుకొని టీచర్ పై పలు సార్లు పొడిచాడు. వెంటనే ఆ విద్యార్థి నుండి తప్పించుకోవడం కోసం ఆ ఉపాధ్యాయులు గట్టి గట్టిగా అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వదలని ఆ స్టూడెంట్ టీచర్ పై అలాగే దాడి చేశాడు. వెంటనే ఆ టీచర్ అరుపులు విన్న తోటి ఉపాధ్యాయులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టూడెంట్ ని పట్టుకొని ఆ విద్యార్థి చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ క్రమంలోనే కొంతమంది టీచర్లు, స్టూడెంట్స్ పై కూడా సైకో విద్యార్థి దాడి చేసినట్టు తెలుస్తోంది. అదంతా కూడా క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే ఆ స్టూడెంట్ ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ టీచర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -