FIFA: బ్రెజిల్‌కు షాకిచ్చిన క్రొయేషియా.. నైమర్ కన్నీటి రోధన.. మెస్సీ ప్రపంచకప్ ఆశలు సజీవం..

FIFA: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్లు  బ్రెజిల్,  నెదర్లాండ్స్‌కు భారీ షాక్. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన  బ్రెజిల్ తో పాటు మాజీ విశ్వవిజేత నెదర్లాండ్స్‌కు ఘోర పరాభవం తప్పలేదు.   బ్రెజిల్‌కు క్రొయేషియా షాకివ్వగా.. నెదర్లాండ్స్‌ను అర్జెంటీనా ఓడించింది.  రెండు మ్యాచ్ లలోనూ  నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో   పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు.

వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన బ్రెజిల్.. క్వార్టర్స్ లో భాగంగా  శుక్రవారం రాత్రి  క్రొయేషియాతో ఆడింది.  ఈ మ్యాచ్ లో ఇరు జట్లు నిర్ణీత సమయం (90 నిమిషాలు)లో చెరో గోల్  (1-1) తో సమంగా నిలిచాయి.   అదనపు సమయం (15 నిమిషాలు) లో కూడా ఫలితం తేలలేదు.  దీంతో  షూట్  అవుట్ అనివార్యమైంది.  షూటౌట్ లో   క్రొయేషియా.. నాలుగు గోల్స్ చేయగా బ్రెజిల్  రెండు గోల్స్ మాత్రమే చేసింది. దీంతో 4-2తో   బ్రెజిల్ ను ఓడించిన క్రొయేషియా  సెమీస్ లోకి అడుగుపెట్టింది.

బ్రెజిల్  సూపర్ స్టార్ నైమర్  పోరాడినా   క్రొయేషియా డిఫెన్స్ ముందు   ఆ జట్టు నిలువలేకపోయింది. షూట్ అవుట్ లో బ్రెజిల్ ఓడిన క్షణంలో నైమర్ కన్నీటిపర్యంతమయ్యాడు.  బ్రెజిల్ ఆటగాళ్లంతా  ఎక్కడున్నవాళ్లు అక్కడే కుప్పకూలిపోయి రోధించారు.  గత నాలుగు సార్లు  ప్రపంచకప్  క్వార్టర్స్ లోనే ఆగిన బ్రెజిల్ ఈసారైనా  ట్రోఫీ కొడుతుందని అంతా భావించారు.  కానీ  బ్రెజిల్ ఆశలపై  క్రొయేషియా నీళ్లు చల్లింది.

ఇక అర్జెంటీనా –  నెదర్లాండ్స్ మ్యాచ్ లో కూడా నిర్ణీత సమయంలో  రెండు జట్లు 2-2 తో సమంగా నిలిచాయి. పెనాల్టీ షూట్ అవుట్ లో మాత్రం అర్జెంటీనా  నాలుగు గోల్స్  చేయగా  నెదర్లాండ్స్ మూడు గోల్స్ మాత్రమే కొట్టింది. దీంతో ఈసారి చివరి ప్రపంచకప్ ఆడుతున్న  లియోనల్ మెస్సీ  వరల్డ్ కప్ ఆశలు సజీవంగా ఉన్నాయి. సెమీస్ లో  అర్జెంటీనా – క్రొయేషియాలు తలపడనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -