FIFA: ఖతర్‌లో పాత్రికేయులకు కష్టాలు మాములుగా లేవుగా.. చుక్కలు చూపిస్తున్న అరబ్బులు

FIFA: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ రోజుకో వివాదంతో మూడు పువ్వులూ ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో వివాదాలు కావాల్సినన్ని వస్తున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి నేటి దాకా ఫిఫా ఏదో ఒక విషయంలో ఫ్రంట్ పేజీల్లోకి ఎక్కుతూనే ఉంది. మానవహక్కుల ఉల్లంఘన, గే సెక్స్ బ్యాన్, లిక్కర్ బ్యాన్ వంటి వివాదాస్పదాంశాలతో వార్తల్లో నిలిచిన ఖతర్ లో పాత్రికేయులకూ తిప్పలు తప్పడం లేదు. ఒక్కో దేశం నుంచి వచ్చిన రిపోర్టర్ కు ఒక్కో రకమైన కష్టాలు ఎదురవుతున్నాయి.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు డానిష్ టీవీ రిపోర్టర్ ఒకరు లైవ్ కవరేజీ ఇస్తుండగా పోలీసు సిబ్బంది సదరు రిపోర్టర్ దగ్గర కెమెరా, మైకు లాక్కుని నానా హంగామా చేశారు. డానిష్ టీవీకి చెందిన రాస్మస్ టాంతోల్డ్ లైవ్ కవరేజీ ఇస్తుండగానే అతడి కెమెరా తీసుకుని దానిని అక్కడే కింద పడేశారు. ‘పబ్లిక్ ప్లేస్ లో వీడియో తీస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు..? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడి (ఖతర్)కు పిలిచారు..?’ అని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరో ఘటనలో అర్జెంటీనాకు చెందిన టీవీ రిపోర్టర్ డొమినిక్ మెట్జర్ హ్యాండ్ బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. ఖతర్ లో ఫిఫా ప్రారంభోత్సవ వేడుకలను కవర్ చేయడానికి వెళ్లిన ఆమె.. ఆ హడావిడిలో పడిపోగా ఓ దొంగ తన చేతివాటం చూపాడు. తన హ్యాండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె తన హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటే గానీ విషయం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కొద్దిసేపట్లోనే దొంగను పట్టించారు.

ఇక ఓ అమెరికా జర్నలిస్టు.. ఎల్జీబీటీక్యూ జెండాను ముద్రించిన షర్ట్ తో ఫిఫా వరల్డ్ కప్ కు రాగా.. అతడు వేసుకున్న రెయిన్ బో టీషర్ట్ ను గుర్తించిన పోలీసులు సదరు జర్నలిస్ట్ షర్ట్ విప్పేస్తేనే లోపలికి పంపిస్తామని అడ్డుకున్నారు. దీని గురించి అతడు తన ట్విటర్ ఖాతాలో రాసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -