FIFA: జపాన్ దెబ్బకు ఫిఫాకు దూరమైన టోర్నీ టైటిల్ పోటీదారు జర్మనీ జట్టు

FIFA: ఖతార్ వేదికగా ఎంతో ఘనంగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ బరిలో దిగిన దిగ్గజ జట్లకు పసికూనలుగా ఉన్న టీంలు షాకిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా దిగ్గజ టీంలను ఖతార్ లో మట్టి కరిపిస్తూ కొన్ని జట్లు సంచలనాలకు కేంద్ర బిందువులు అవుతున్నాయి.

ఈ ఏడాది ఫిఫా కప్ రేసులో ఉన్న హాట్ ఫేవరెట్ టీం అర్జెంటీనాను ఊహించని రీతిలో సౌదీ అరేబియా ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో టైటిల్ ఫేవరెట్ టీం అయిన ఫ్రాన్స్ ను మరో పసికూన అయిన ట్యునీసియా మట్టి కరిపించింది. అలాగే జపాన్ ఇచ్చిన షాక్ తో జర్మనీ ఇంటి బాట పట్టింది.

జపాన్, స్పెయిన్ ల మధ్య ఎంతో ఆసక్తికరంగా సాగిన మ్యాచులో జపాన్ విజయం సాధించింది. అయితే జపాన్ గెలుపుతో ఫిఫా వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. 92 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో జర్మనీ బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్ లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలి రౌండ్ చివరి మ్యాచులో జర్మనీ కోస్టారికాను చిత్తు చేసినా కానీ జపాన్ వల్ల జర్మనీ ఫిఫా నుండి బయటకు రావాల్సి వచ్చింది.

ఇక జపాన్ మరియు స్పెయిన్ ల మధ్య జరిగిన మ్యాచులో జపాన్ 2-1తేడాతో స్పెయిన్ మీద గెలిచింది. అయితే తొలి అర్ధభాగంలో స్పెయిన్ 1-0గా ఉండగా.. రెండో అర్దభాగంలో జపాన్ విజృంభించింది. దీంతో 51వ నిమిషంలో రెండో గోల్ చేసిన జపాన్ 2-1 తేడాతో మ్యాచ్ ను గెలిచింది. కానీ గోల్ తేడాతో స్పెయిన్ కు నాకౌట్ టికెట్ దక్కింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -