FIFA: పటిష్ట అర్జెంటీనాను ఓడించినందుకు సౌదీ అరేబియా రాజు ఏం చేశాడంటే..

FIFA: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఖతర్ లోని లుసాలీ స్టేడియం వేదికగా అర్జెంటీనా-సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌదీ సంచలన విజయం నమోదు చేసింది. అర్జెంటీనాను 1-2 తేడాతో ఓడించి టోర్నీ ఫేవరేట్లకు ఊహించని షాకిచ్చింది. ఆట తొలి అర్థభాగంలో అసలు పోటీలోనే లేని సౌదీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం రెచ్చిపోయి పటిష్టమైన అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించుకుని రెండు గోల్స్ కొట్టింది. తద్వారా అర్జెంటీనా జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. అంతర్జాతీయ స్థాయిలో 36 విజయాల తర్వాత అర్జెంటీనాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.

 

అర్జెంటీనాను అద్భుత ఆటతో మట్టికరిపించడంతో సౌదీ రాజు దేశ ప్రజలకు ఊహించని కానుకనిచ్చాడు. చారిత్రక విజయం సాధించినందుకు గాను బుధవారం దేశంలో సెలవుదినంగా ప్రకటించాడు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు దినాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి.

 

ఈ మేరకు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం మ్యాచ్ అనంతరం ఈ ప్రకటన చేశాడు. ఇది దేశంలో సంబురాలు చేసుకోవాల్సిన సమయమని, దానిని ప్రజలంతా ఆస్వాదించాలని ఆయన సూచించాడు. ఆయన సూచనకు రాజు సల్మాన్ కూడా ఆమోదం తెలిపారు.

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆట తొమ్మిదో నిమిషంలో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఆ జట్టుకు తొలి గోల్ కొట్టాడు. ఆట తొలి అర్థభాగం అర్జెంటీనా బాగానే ఆడింది. కానీ సెకండ్ హాఫ్ లో సౌదీ పుంజుకుంది. సౌదీ తరఫున అల్ సెహారి 47వ నిమిషంలో గోల్ కొట్టగా 53వ నిమిషంలో అర్జెంటీనా డిఫెన్స్ ను ఛేదించుకుని సలీమ్ అల్ దవాసరి అద్భుత గోల్ కొట్టాడు. దీంతో సౌదీ ఆధిక్యం 2-1కి చేరింది. ఈ విజయంతో సౌదీ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -