FIFA World Cup 2022: మెస్సీ…. తేలుస్తాడా? మునుగుతాడా?

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌ కప్‌ ఆఖరి దశకు చేరుకుంది. ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. అంచనాలు లేకుండా దూసుకొచ్చిన క్రొయేషియా ఇవాళ సెమీఫైనల్‌లో హాట్‌ ఫేవరెట్‌ అర్జెఈంటీనాతో తలపడనుంది. నేడు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ కీలక మ్యాచ్‌ జరగనుంది. కీలకమైన దిగ్గజ ఆటగాళ్లు నెయిమర్‌, క్రిస్టియానో రొనాల్డో కన్నీటితో టోర్నీ నుంచి నిష్ర్కమించారు. లక్షలాది మంది అభిమానులు వీరిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

 

ఫిఫా వరల్డ్‌కప్‌లో నేడు మరో ఇద్దరు స్టార్‌ ప్లేయర్లలో ఒకరి కథ తేలిపోనుంది. క్రొయేషియా ప్లేయర్‌ మోద్రిచ్‌ లేదా మెస్సీ.. ఇద్దరిలో ఒకరే తదుపరి మ్యాచ్‌లో ఆడే చాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మెస్సీపైనే ఉంది. ప్రపంచకప్‌ నెగ్గాలన్న కల నెరవేర్చుకుంటాడా? లేదా ఇంటిదారి పట్టి అభిమానుల్ని బాధాతప్త హృదయాలతో ముంచెత్తుతాడా అనేది నేడు తేలిపోనుంది.

 

వరల్డ్‌ కప్‌ కోసం సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నాడు మెస్సీ. ఇక రిటైర్‌మెంట్‌కు ఒక స్టెప్‌ మిగిలి ఉంది. అదే నేటి మ్యాచ్‌. చివరి ప్రయత్నంలో కప్‌ను అందుకొని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాడు మెస్సీ. తమ దేశాన్ని మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలపాలని అర్జెంటీనా తహతహలాడుతోంది. అంచనాల్లేకుండా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న క్రొయేషియా.. ఆరోసారి ప్రపంచ కప్‌ ఆడుతోంది.

 

ఆశలన్నీ అతడిపైనే..
గత ప్రపంచ కప్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన క్రొయేషియా.. ఇప్పుడు కూడా అర్జెంటీనాపై బలప్రదర్శన కొనసాగించాలని చూస్తోంది. గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇక బలంగా పుంజుకొని గెలిచి తన స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని మెస్సీ దూకుడుగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడిదే కీలకపాత్ర అయ్యే చాన్స్‌ కూడా ఉంది. ఇక పట్టుదలే ఆయుధంగా సాగుతున్న క్రొయేషియా.. కప్పు వేటలో అర్జెంటీనాకు అడ్డుగా నిలుస్తోంది. వెటరన్‌ లూకా మోద్రిచ్‌ నేతృత్వంలో క్రొయేషియా ఫుల్‌జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగా అవకాశం కనిపిస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Balakrishna: బాలయ్య కెరీర్ లో చిక్కుకున్న వివాదాలివే.. నీ బ్లడ్, బ్రీడ్ అప్పుడైమైందంటూ?

Balakrishna: బాలయ్య విచిత్రమైన మెంటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా తనకి ఇష్టం వచ్చినట్లు చేసి సభా...
- Advertisement -
- Advertisement -