Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరు అనే పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలో 150 సినిమాలకు పైగా నటించి నటుడుగా తెలుగు నాట తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు చిరంజీవి. ఇక చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్నాడు.
అదేవిధంగా దాసరి నారాయణరావు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇతడు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 150 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు బుక్ లో ఎక్కాడు దాసరి. ఇక స్వయంగా దాసరి 53 సినిమాలను నిర్మించాడు. ఇదంతా పక్కన పెడితే ఇటువంటి దాసరికి, మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయట.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అగ్ర స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు దాసరి కూడా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక లంకేశ్వరుడు షూటింగ్ నేపథ్యంలో వీరిద్దరికీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ మనస్పర్ధలు ఎక్కడ వరకు వెళ్లాయి అంటే దాసరి లేకుండానే చిరంజీవి ఏకంగా మూడు పాటలను చిత్రీకరించాడు.
ఆ విధంగా లంకేశ్వరుడు సినిమాలో రెండు పాటలు తప్పించి మిగతా మూడు పాటలు కూడా దాసరి లేకుండానే చిరంజీవి చిత్రీకరించాడు. ఏదేమైనా ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా చిరంజీవికి కూడా ఈ సినిమా ఒక ప్రత్యేకమని చెప్పవచ్చు. అప్పటి ప్రేక్షకులను ఈ సినిమా భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.