Rahul Gandhi: రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు.. మునుగోడు ఎన్నిక సమయంలోనే..

Rahul Gandhi: కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో కాంగ్రెస్ పార్టీని ఇప్పటినుంచే బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్లో ఈ పాదయాత్ర ద్వారా జోష్ నింపాలని రాహుల్ భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టులు అన్నట్లు.. లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడానికి రామఉల్ పాదయాత్ర ఉపయోపడే అవకాశముంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్లిష్ట పరిస్ధితును ఎదుర్కొంటోంది. ఎన్డీయే ప్రభావానికి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బలహీనపడిపోవంతో ఆ పార్టీలోని చాలామంది బలమైన లీడర్లు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలపడిపోయింది. దీంతో రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ కు మళ్లీ పున:ర్వైభవం తీసుకురావాలని హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ పాదయాత్రపై తీర్మానం చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాలను టచ్ చేసేలా రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసింది. భారత్ జోడో యాత్ర పేరుతో ఈ పాదయాత్ర రాహుల్ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 148 రోజులపాటు 3500 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 వ తేదీన కన్యాకుమారిలో ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. 5 నెలల పాటు నిర్విరామంగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రతిరోజు 25 కి.మీ నడవనున్నారు. పలుచోట్ల సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలో పాదయాత్రలో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

50 మంది జాతీయ నేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ధరల పెరుగదల అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

ఇక తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. కర్ణాటక నుంచి రాహుల్ పాదయాత్ర నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద తెలంగాణలోకి చేరుకోనుంది. మక్తల్,కొడంగల్, పరిగి, వికారాబాద్, జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ లో రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి చేరుకోనుంది. అదే సమయంలో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చే అవకాశముంది. దీంతో రాహుల్ పాదయాత్ర మునుగోడులో కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాహుల్ పాదయాత్రలో తెలంగాణలో పార్టీ పుంజుకోవడానికి ఉపయోపగపడుతుందని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ కాస్త బలంగా కనిపించింది. అయితే సీనియర్ నేతల మధ్య విబేధాలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్ల నేతలు సహకరించకపోవడం, నేతల మధ్య వివాదాలతో టీ కాంగ్రెస్ లో స్తబ్ధత నెలకొంది. ప్రజా సమస్యలపై టీ కాంగ్రెస్ చేసే పోరాటం కంటే ఆ పార్టీలోని విబేధాలే మీడియాలో హైలెట్ అవుతున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలహీనపడిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -