LIC New Scheme: LIC అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే?

LIC New Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం ఆర్థికంగా ఎలాంటి భయపడకుండా ఉండవచ్చు. ఇలాంటి స్కీమ్‌లు ఏమైనా ఉన్నాయా? అని చాలా మంది సెర్చ్ చేస్తుంటారు. చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత.. డబ్బులు ఎలా వస్తాయని, ఎలా జీవితం గడపాలనే విషయంపై ఆలోచన ఉంటుంది. అందుకే ఈ విషయంపై ముందునుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ స్కీమ్ అందుబాటులోకి ఉంది. ఈ రోజు మనం ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన అనేది సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. అయితే ఈ పాలసీ తీసుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మీకు జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే సింగిల్ ప్రీమియం డబ్బులు నామినీకి చెల్లించడం జరుగుతోంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వెంటనే రెగ్యులర్ ఇన్‌కమ్ ప్రారంభమవుతుంది. అంటే పెన్షన్ కోసం మీరు 60 ఏళ్లు వచ్చేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల వయసు నుంచి మీరు ఈ పెన్షన్‌ను పొందవచ్చు. అలాగే ఈ పాలసీలో చేరేందుకు మీ కనీస వయసు 40 ఏళ్లు.. గరిష్ట వయసు 80 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టవచ్చు.

ఒకవేళ డిపాజిట్ చేసిన డబ్బుల్ని తిరిగి పొందాలనుకుంటే కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అలా చేయాలని అనుకుంటే మీ పెట్టుబడిలో 5 శాతం డబ్బుల్ని డిడక్ట్ చేసి.. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ మీకు చెల్లిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్నితెలుసుకోవాలి. సరళ్ పెన్షన్ పాలసీ తీసుకున్న 6 నెలల తర్వాత ఏ సమయంలోనైనా రిటర్న్ చేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -