FIR On Srikalahasti CI: శ్రీకాళహస్తి సీఐపై ఎఫ్ఐఆర్.. అసలేం జరిగిందంటే..

FIR On Srikalahasti CI: ఏపీలోని శ్రీకాళహస్తి సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. అక్కడ పని చేస్తున్న సీఐ అంజూయాదవ్.. గతంలో ఓ మహిళపై అమానుషంగా దాడి చేయడంతోనే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. గతంలో ఓ హోటల్ సమయానికి మూయలేదని సీఐ అంజూయాదవ్.. ఓ మహిళపై దాడికి పాల్పడింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ జోక్యంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే..

ఓ హోటల్ సమయానికి మూయలేదనే కారణంతో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారించిన తీరు ఇప్పుడు ఏపీ పోలీసులకు తలవంపులు తెచ్చిపెట్టింది. బాధిత మహిళ శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వహిస్తోంది. మహిళ దగ్గరకెళ్లిన సీఐ అంజూ యాదవ్.. ఆమె భర్త గురించి అడిగింది. తెలీదని చెప్పడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన సీఐ.. ఆ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసింది. బాధిత మహిళ కుమారుడు వేడుకున్నా కనికరించలేదు. చీర ఊడిపోతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఈడ్చుకుంటూ జీపులో ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లింది.

తనుపై సీఐ అంజూ యాదవ్ అమానవీయంగా దాడి చేసిందని బాధితురాలు వాపోయింది. తమ కుటుంబంపై ఆమె పగబట్టిందని కన్నీరుమున్నీరైంది. దీంతోపాటు సీఐ అంజూ యాదవ్.. తోటి పోలీసులను కూడా అసభ్యంగా తిడుతుందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. ట్విట్టర్ ద్వరా జాతీయమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, ఓ మహిళపై దాడి చేసినా ఆమెపై రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకోలేదని తెలిపింది. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్సీ డబ్ల్యూను ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. తక్షణమే సీఐ అంజూ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. బాధితురాలికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేసింది. ఎప్పటిలోగా స్పష్టమైన దర్యాప్తు చేపడతారో తెలపాలని ఆదేశిస్తూ ట్వీట్ చేసింది. ఏపీ పోలీసులు ఇలా తరచూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -