Kerala: పీకల్లోతు అప్పులు.. క్షణాల్లోనే లక్షాధికారి గా మారాడు!

Kerala: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని వరిస్తోందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు గా ఉన్నవారు బీదరికం లో రావొచ్చు.. కటిక బీదరికం లో ఉన్నవారు రాత్రికి రాత్రే అపర కుబేరులు కావొచ్చు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. సదరు వ్యక్తికి కష్టాలు వెంటాడుతుండగా అంతలోనే అదృష్టం వరించింది. అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేని స్థితిలో ఉన్న అతడు ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటికి సంబంధించిన పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు రుణం తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్‌ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్‌ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్‌ నుంచి నోటీస్‌ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్‌ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్‌ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్‌ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలి.. అప్పు ఎలా తీర్చాలి అని తలలు çపట్టుకున్నారు. గడువులోగా రుణం చెల్లించకపోతే ఇల్లు బ్యాంకు అ«ధికారులు సొంతం చేసుకుంటారు అనే భయంలో కుంగిపోయారు.

అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్‌ దక్కినట్లు కాల్‌ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్‌ ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అదృష్టం అంటే ఇదేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -