Ambergris: జాలర్లను కోటీశ్వరులు చేసిన అంబర్ గ్రిస్.. కానీ ఏమైందంటే?

Ambergris: ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని సముద్రంలో వేటకు వెళుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు జాలర్లు. అయితే రాత్రి పగలు కష్టపడితేనే వారికి పూట గడుస్తుంది. అయితే కొన్నిసార్లు అనుకోకుండా జాలర్ల వలలో ఎంతో ఖరీదైన చేపలు పడటం వల్ల రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన జాలర్లు ఎంతోమంది ఉన్నారు. ఇలా జాలర్ల వలలో ఏకంగా 50 కోట్లు విలువైన అంబర్ గ్రిస్ దొరకడంతో జాలర్లు కోటీశ్వరులుగా మారిపోయారు.

ఇలా జాలర్లు ఎంతో విలువైన అంబర్ గ్రిస్ వారి వలలో పడినప్పటికీ వారు మాత్రం దానిని అమ్ముకొని కోట్ల డబ్బును సొంతం చేసుకోకుండా అంబర్ గ్రిస్ దొరికిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో అటవీశాఖ అధికారులు జాలర్ల వద్ద నుంచి అంబర్ గ్రిస్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ అంబర్ గ్రిస్ అంటే ఏంటి ఇది ఇంత ఖరీదు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

అంబర్ గ్రిస్ అనేది తిమింగలం వాంతి. దీనికి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అయితే విదేశాలలో అంబర్ గ్రిస్ కి మరింత డిమాండ్ ఉండడం చేత ఇది దొరికిన వారు కోటీశ్వరులుగా మారిపోతారు. కానీ తాజాగా తమిళనాడులోని కల్పాక్కం సమీపంలో జాలర్ల వలలు వేయగా ఏకంగా వీరి వలలో 38.6 కిలోల అంబర్ గ్రిస్ దొరికింది దీని విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

అయితే జాలర్లకు భారీ మొత్తంలో అంబర్ గ్రిస్ దొరకడంతో వెంటనే జాలర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అంబర్ గ్రిస్ తమ స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా విదేశాలలో పెర్ఫ్యూమ్ ల తయారీ, అలాగే ఆల్కహాల్స్, ఇతర ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్ల అంబర్ గ్రిస్ కి ఎంతో డిమాండ్ ఉంది. అయితే ఈ జాలర్లు మాత్రం ఎంతో విలువైనటువంటి అంబర్ గ్రిస్ ప్రభుత్వ అధికారులకు అందజేయడంతో పలువురు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -