Fitness Trainer: పెళ్లి చేసుకుంటానని చెప్పి తెలుగు నటిని మోసం చేసిన ఫిట్నెస్ ట్రైనర్?

Fitness Trainer: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక యాక్టర్లు కాస్టింగ్ కౌచ్ అనే బాధను ఎదుర్కొంటూనే ఉంటారు. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి బాధను ఎదుర్కొన్న పెద్ద స్టార్ హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో బయటపడలేదు. కానీ చిన్న చిన్న సెలబ్రేటీలు కాస్టింగ్ కౌచ్ అనే బాధను తట్టుకోలేక వెలుగులోకి వచ్చారు.

ప్రస్తుతం ఈ క్యాస్టింగ్ కౌచ్ కొంత కాలంగా వినిపించడం లేదు. కానీ సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న సెలబ్రేటీలు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. మరికొందరు ఆ వేదింపులను తట్టుకొని తెలుగులోకి వస్తే.. కొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక పూర్తిగా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. నిజానికి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇటువంటి వేదింపులు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి.

ఇక ప్రస్తుత కాలంలో ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్న చాలామంది సీరియల్ నటులు వెలుగులోకి వచ్చారు. ఈ విషయం లో వాళ్లు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం ద్వారా వారికి తగిన న్యాయం జరిగింది. మరి ఇదే క్రమంలో తాజాగా ఒక ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు అదేంటో మనం తెలుసుకుందాం. ముంబైలో ఒక తెలుగు నటిపై ఒక ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారం చేసాడు. ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిందట.

దాంతో పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఫిట్నెస్ ట్రైనర్ అయిన ఆదిత్య కపూర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడట. అంతేకాకుండా కొన్నిసార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఈ విధంగా ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి చెప్పడం లేదని, ఆమె పెళ్లి గురించి అడిగితే తనపై దాడి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అత్యాచారానికి గురైన ఆ నటి పేరు మాత్రం ఇంతవరకు వెలుగులోకి రాలేదు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts