Flipkart Offers: గూగుల్ 5జీ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్.. రూ.11 వేల డిస్కౌంట్!

Flipkart Offers: మంచి డిస్కౌంట్ లో 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్. ఇలాంటి వారి కోసం మంచి డీల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చాలా కాలం కిందటే స్మార్ట్ ఫోన్ల రంగంలోకి కూడా వచ్చింది. గూగుల్ కు చెందిన పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు భారీ రాయితీ లభిస్తోంది. ఎంతంటే ఏకంగా రూ.11 వేలు తగ్గింపు ఇచ్చింది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

 

గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ 2022 జూలైలో మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర రూ.43,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీ వేరియంట్ తో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను కేవలం రూ.34,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు 20 శాతం వరకు తగ్గింపు ధరలో లభిస్తోంది.

క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. సుమారు రూ.2 వేల దాకా అదనపు తగ్గింపు కూడా కలుపుకుంటే గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ పై సుమారు 11 వేల రూపాయల దాకా డిస్కౌంట్ గ్యారెంటీ. ఇందులో 6.1 అంగుళాల హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ, టైటన్ ఎం2 ప్రాసెసర్ లాంటి అధునాతన ఫీచర్లు కలిగి ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ లో 21 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. బ్యాటరీ 4410 ఎంఏహెచ్. 18 వాట్స్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ పై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. స్టార్టింగ్ ఈఎంఐ ప్రైస్ రూ.1,697.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -