Focus Review: ఫోకస్ సినిమా రివ్యూ & రేటింగ్!

విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022

నటీనటులు : విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భాను చందర్, రఘుబాబు, జీవీ, షాయాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్యభగవాన్ తదితరులు

నిర్మాణం : రిలాక్స్ మూవీ మేకర్స్

దర్శకత్వం : జి.సూర్యతేజ

సినిమాటోగ్రఫీ : జె.ప్రభాకర్ రెడ్డి

సంగీతం : వినోద్ యజమాన్య

ఎడిటర్ : సత్య గిడుతూరి

నిర్మాత : వీరభద్ర రావు

Focus Movie Review and Rating

సూర్యతేజ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ఫోకస్. ఈ మూవీలో విజయ్ శంకర్, అషు రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెరపై తనదైన హాట్ అందాలతో మైరపిస్తున్న అషు రెడ్డి.. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈటీవీ నిర్వహించే షోలలో పాల్గొంటున్న అషు రెడ్డి.. అనంతరం బిగ్ బాస్ ఎంట్రీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

కథ: ఫోకస్ సినిమా కథలోకి వస్తే.. ఇందులో పోలీస్ సూపరింటెండెంట్ గా వివేక్ వర్మ (భాను చందర్) కనిపిస్తాడు. న్యాయమూర్తి ప్రమోదాదేవి (సుహాసిని మణిరత్నం) వివేక్ వర్మ భార్య. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటారు. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. వివేక్ వర్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడంతో ఎస్ఐ జయశంకర్ ఈ కేసును టేకోవర్ చేస్తాడు. ప్రత్యేక దర్యాప్తు చేపడతాడు.

కేసు దర్యాప్తులో సాయం చేయడానికి ప్రేమ (అషు రెడ్డి) సీన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కథ ఆసక్తికరంగా సాగుతుంది. దర్యాప్తులో భాగంగా కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. వివేక్ వర్మను ఎవరు హత్య చేశారు? హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? చివరికి హత్య చేసిన దుండగుడిని పట్టుకుంటారా? లేదా? అనేది మిగతా కథ. ఇది నేరుగా సినిమా చూస్తే అర్థం అవుతుంది.

కథలో పోలీస్ ఆఫీసర్ గా విజయ్ శంకర్ అలరించాడని చెప్పొచ్చు. పాత్రకు తగిన న్యాయం చేయడానికి బాగా నటించాడు. ఖాకీ పాత్రలో లీనమైనట్లు కనిపిస్తాడు. భావోద్వేగ భరితమైన సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. సుహాసిని మణిరత్నం కూడా తనదైన శైలి నటనతో మెప్పించింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. అషు రెడ్డి యాక్టింగ్ లో మెరుగైన మార్కులు కొట్టేసింది. యాక్టింగ్ లో మరింత మెరుగైంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల నటన కూడా ఫర్వాలేదనిపించింది.

సాంకేతిక అంశాల్లో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సి ఉంది. దర్శకుడు కథను బాగా ప్రజెంట్ చేయగలిగాడు. వినోద్ బాణీలు ఫర్వాలేదనిపించాయి. నిర్మాణ విలువల్లో నాణ్యతపాటించారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మిగతా టెక్నికల్ విభాగాలన్నీ బాగానే పని చేశాయి.

విశ్లేషణ: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి సినిమాల్లో ఎక్కువ శాతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫీలయ్యే సీన్లు ప్రేక్షకులు కోరుకుంటారు. మర్డర్ మిస్టరీని ఛేదించడంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటే ఆ సినిమాను ఆదరిస్తారనడంలో సందేహం లేదు. హత్యకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ మిస్టరీ ఫోకస్ చిత్రంలో కాస్త ఆసక్తికరంగానే మలిచారు. బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి కథను ఎంచుకోవడం కూడా ఓ సాహసంగానే చెప్పొచ్చు. ఏ మాత్రం తేడా కొట్టినా సినిమా డిజాస్టర్ వైపుమళ్లే అవకాశం ఉంటుంది.

కథను నడిపిన విధానం కూడా బాగుంది. మధ్య మధ్యలో ట్విస్టులు కాస్త ఆసక్తిని పెంచాయి. ఎక్కడా కథలో బోర్ కొట్టకుండా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అయితే, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త బాగా తీసి ఉండాల్సిందనే అభిప్రాయం ప్రేక్షకులకు కలుగుతుంది. సినిమా మధ్యలో కొన్ని సీన్లయితే కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తాయి. లెన్తీ సీన్లను ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అవుతారు. కానీ, ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ చిత్రాలు జనాలు ఆసక్తిగా తిలకిస్తారనడంలో సందేహం లేదు. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలన్నీ దాదాపు చాలా మందికి నచ్చుతాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ

మధ్యలో వచ్చే ట్విస్టులు

ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్ :

ఇంటర్వెల్ ముందు సీన్లు

కొన్ని సన్నివేశాల్లో సాగదీత

బాటమ్ లైన్ : సస్పెన్స్ ఉంది కానీ.. కాస్త సాగదీశారు

రేటింగ్ 3/5

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -